NTV Telugu Site icon

Zakir Naik: జకీర్ నాయక్‌‌కు పాకిస్థాన్ రెడ్‌కార్పెట్.. వరుస ఉపన్యాసాలు ఇచ్చేందుకు ఆహ్వానం

Zakirnaik

Zakirnaik

భారత్ నుంచి పారిపోయి మలేసియాలో ఉంటున్న వివాదాస్పద మత ప్రబోధకుడు జకీర్ నాయక్‌కు దయాది దేశం పాకిస్థాన్ సోమవారం రెడ్‌కార్పెట్ స్వాగతం పలికింది. పాక్ ప్రభుత్వ ఆహ్వానం మేరకు ఇస్లామాబాద్, కరాచీ, లాహోర్‌లో వరుస ఉపన్యాసాలు ఇచ్చేందుకు ఆయన ఇస్లామాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ప్రధాన మంత్రి యూత్ ప్రోగ్రాం చైర్మన్ రానా మసూద్, రెలిజియస్ అఫైర్ మంత్రిత్వ శాఖ అడిషనల్ సెక్రటరీ సైయద్ అటావుర్ రహమాన్ తదితర ప్రభుత్వ ఉన్నత స్థాయి అధికారులు స్వాగతం పలికారు. జకీర్ వెంట ఆయన కుమారుడు ఫరిఖ్ నాయక్ కూడా ఉన్నాడు.

ఇది కూడా చదవండి: Israel: హమాస్ లెబనాన్‌ చీఫ్ ఫతే షెరీఫ్‌ కూడా హతం.. ఇజ్రాయెల్ సంచలన ప్రకటన

జకీర్ నాయక్ నెల రోజులు పాకిస్థాన్‌లో పర్యటించనున్నారు. పర్యటనలో పలువురు ప్రభుత్వ సీనియర్ అధికారులతో సమావేశమవుతారు. పలు పబ్లిక్ ఈవెంట్స్‌లో పాల్గొంటారు. పాకిస్థాన్ ఆహ్వానం మేరకు జకీర్ నాయక్, షేక్ ఫరిఖ్ నాయక్ పాక్ టూర్‌లో పాల్గొంటున్నట్టు ఆయన టీమ్ సోషల్ మీడియా ద్వారా తెలిపింది. అక్టోబర్ 5, 6 తేదీల్లో కరాచీ, 12-13 తేదీల్లో లాహోర్, 19-20 తేదీల్లో ఇస్లామాబాద్‌లో ఆయన ఉపన్యాసాలు ఉంటాయని తెలిపింది.

విద్వేష ప్రసంగాలతో జకీర్ నాయక్ వివాదాస్పదుడిగా పేరు తెచ్చుకున్నారు. భారత ప్రభుత్వ ఎజెన్సీ ఎన్ఐఏ వాటెండ్ లిస్ట్‌లో ఆయన ఉన్నారు. 2016 మనీ లాండరింగ్ కేసులో పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన భారత్ నుంచి పారిపోయి ప్రస్తుతం మలేసియాలో ఉంటున్నారు. రెచ్చగెట్టే ప్రసంగాలు చేశాడనే ఆరోపణలు కూడా ఆయనపై ఉన్నాయి. తమ దేశంలో అడుగుపెట్టేందుకు కెనడా, యూకే సైతం నిరాకరించాయి.

ఇది కూడా చదవండి: Moon Temperature: లాక్‌డౌన్ ఎఫెక్ట్.. చంద్రుని ఉపరితలంపై తగ్గిన ఉష్ణోగ్రత..!

Show comments