NTV Telugu Site icon

Pakistan: పాక్ అధ్యక్షుడు జర్దారీకి ప్రమాదం.. విమానం దిగుతుండగా తుళ్లిపడడంతో కాలుకి గాయం

Pakistanpresident

Pakistanpresident

పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ ప్రమాదానికి గురయ్యారు. అక్టోబర్ 30 రాత్రి దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో విమానం దిగుతుండగా ఒక్కసారిగా ఆయన తుళ్లిపడ్డారు. దీంతో ఆయన కాలుకి ఫ్రాక్చర్ అయింది. విమానం డీబోర్డింగ్ చేస్తున్నప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదానికి సంబంధించిన సమాచారాన్ని పాకిస్థాన్ ప్రెసిడెంట్ హౌస్ ధృవీకరించింది. అక్టోబర్ 31న ఒక ప్రకటనలో తెలిపింది.

ఇది కూడా చదవండి: Ambati Rambabu: పోలవరంపై మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు.. కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం

దుబాయ్ ఎయిర్‌పోర్టులో జర్దారీ కాలుకు గాయం కావడంతో హుటాహుటినా చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారని పాక్ మీడియా తెలిపింది. వైద్యులు పరీక్షించి.. కాలుకు చికిత్స చేశారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని తెలుస్తోంది. చికిత్స అనంతరం ఆయన్ను డిశ్చార్జ్ చేశారు. అయితే పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. జర్దారీ నాలుగు వారాల పాటు విశ్రాంతిలో ఉంటారని ప్రెసిడెంట్ కార్యాలయం పేర్కొంది. జర్దారీకి ప్రస్తుతం 69 ఏళ్లు. అనేకమైన ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు పాక్ మీడియా తెలిపింది. మార్చి 2023లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో కంటి శస్త్రచికిత్స చేయించుకున్నారు. 2022లో ఛాతీ ఇన్‌ఫెక్షన్‌కు చికిత్స కోసం కరాచీలోని డాక్టర్ జియావుద్దీన్ ఆసుపత్రిలో వారం రోజుల పాటు ఉన్నారు. జర్దారీ కోవిడ్‌కు గురై ఇబ్బందులు పడ్డారు. ఇక తరుచు ప్రయాణాల వల్ల కూడా జర్దారీ ఆరోగ్యం దెబ్బతింటోంది. పలుమార్లు ఆస్పత్రిలో చేరిన దాఖలాలు ఉన్నాయి.

ఇది కూడా చదవండి: Mahatma Ghat : మహోన్నతంగా మహాత్మ ఘాట్​

Show comments