NTV Telugu Site icon

Pakistan: విమాన సిబ్బంది సరైన “లోదుస్తులు” ధరించాలి.. పాకిస్తాన్ ఎయిర్‌లైన్స్ వింత ఆదేశాలు

Pia

Pia

Pakistan airlines order to cabin crew is ‘wear proper undergarments’: పాకిస్తాన్ దేశం అప్పుడప్పుడు వింత ఆదేశాలు జారీ చేస్తుంటుంది. చెప్పాలనుకున్నది ఒకటైతే మరో విధంగా చెబుతూ అబాసుపాలు అవుతుంది. తాజాగా పాకిస్తాన్ ఇంటర్నెషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ) ఇచ్చిన ఆదేశాలు ఆ దేశంలో విమర్శలకు గురువుతున్నాయి. విమాన సిబ్బందికి డ్రెస్ కోడ్ గురించి ఆదేశాలు జారీ చేసింది పీఐఏ. ఈ ఆదేశాల పట్ల అక్కడి మీడియా, నెటిజెన్లు పీఐఏ వ్యవహారశైలిపై విరుచుకుపడుతున్నాయి. పీఐఏ సిబ్బంది యూనిఫాం కింద సరైన ‘లోదుస్తులు’ ధరించడం తప్పని సరి అని ఆదేశాలు జారీ చేసింది. సరైన వస్త్రధారణ లేకపోవడం వల్ల పాకిస్తాన్ ఎయిర్‌లైన్స్ పై ప్రతీకూల ప్రభావం పడుతుందని పేర్కొంది.

సరైన లోదుస్తులపై ఫార్మర్ డ్రెస్ వేసుకోవాలంటూ చెప్పుకొచ్చింది పీఐఏ. డ్రెస్సింగ్ పాకిస్తాన్ సంస్కృతి, జాతీయ నైతికతకు అనుగుణంగా ఉండాలని పీఐఏ మార్గదర్శకాలు జారీ చేసింది. చాలా మంది క్యాబిన్ క్రూ ఇంటర్ సిటీలో ప్రయాణిస్తున్నప్పుడు, హోటళ్లలో బస చేస్తున్నప్పుడు సాధారణ దుస్తులు ధరించడం సంస్థపై ప్రభావాన్ని చూపిస్తోందని మెమోలో పేర్కొంది. ఈ ఆదేశాాల పట్ల అక్కడి మీడియా పీఐఏను ఏకిపారేస్తోంది. దీంతో పీఐఏ ఈ మెమోను ఉపసంహరించుకుంది.

Read Also: Asaduddin Owaisi assault case: అసదుద్దీన్ ఓవైసీ హత్యా నిందితులకు బెయిల్.. యూపీ ప్రభుత్వ స్పందన కోరిన సుప్రీంకోర్టు

దేశవ్యాప్తంగా పీఐఏ తీరుపై ఆగ్రహం వ్యక్తం కావడంతో దిద్దుబాటు చర్యలకు దిగింది. అయితే ఈ మార్గనిర్దేశకాలు సిబ్బంది సరైన దుస్తులు ధరించడానికే అని.. అయితే అననుకోకుండా కొన్ని అనుచితమైన పదాలు మార్గనిర్దేశకాల్లో వచ్చాయని పీఐఏ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఆదేశాలకు వ్యక్తిగతంగా విచారిస్తున్నట్లు పీఐఏ జనరల్ మేనేజర్ ఫ్లైట్ సర్వీసెస్ అమీర్ బషీర్ అన్నారు. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ) పాకిస్తాన్ లో అతిపెద్ద ప్రభుత్వ ఎయిర్‌లైన్స్ సంస్థ. ప్రతీరోజు 100కు పైగా విమానాలను పాకిస్తాన్ నుంచి ఆపరేట్ చేస్తోంది. ఆసియా, యూరప్, మిడిల్ ఈస్ట్, అమెరికా అంతటా 25 అంతర్జాతీయ, 18 జాతీయ గమ్యస్థానాల నుంచి సర్వీసులను అందిస్తోంది.