Afghan-Pakistan War: వెన్నుపోటు పొడవడం పాకిస్తాన్‌కు వెన్నతో పెట్టిన విద్య. ఇది మరోసారి నిజమైంది. ఆఫ్ఘానిస్తాన్ దాడులకు తాళలేక, మధ్యవర్తిత్వం చేసి, దాడుల్ని ఆపేలా చేయాంటూ సౌదీ అరేబియా, ఖతార్‌లను పాకిస్తాన్ వేడుకుంది. శుక్రవారం, ఖతార్ వేదికగా పాక్, తాలిబాన్ అధికారుల మధ్య మరో 48 గంటల పాటు ‘‘కాల్పుల విరమణ’’ ఒప్పందం పొడగించాలని నిర్ణయం కుదరింది.
Read Also: Tripura: పశువుల్ని దొంగిలించేందుకు వచ్చి, చచ్చారు.. బంగ్లాదేశీయుల మృతిపై వివాదం..
అయితే, దీనిని పట్టించుకోని పాకిస్తాన్ తన వక్ర బుద్ధిని చూపించింది. కాల్పుల విరమణ ఒప్పందం పొడగించానికి పరస్పరం అంగీకరించిన కొన్ని గంటలకే పాకిస్తాన్, ఆఫ్ఘానిస్తాన్‌పై వైమానిక దాడులకు తెగబడింది. డ్యూరాండ్ రేఖ వెంబడి ఆఫ్ఘనిస్తాన్ లోని పక్టికా ప్రావిన్సులోని అనేక జిల్లాలపై దాడులు చేసినట్లు తాలిబాన్ తెలిపింది. అర్గున్, బెర్మల్ జిల్లాల్లోని అనేక ఇళ్లపై ఈ దాడులు జరిగినట్లు ఆఫ్ఘానిస్తాన్ మీడియా ఛానెల్ టోలోన్యూస్ నివేదించింది. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టానికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు.
