NTV Telugu Site icon

Pakistan train hijack:100 మంది బందీలను రక్షించిన పాకిస్తాన్ సైన్యం.. 16 మంది మిలిటెంట్లు హతం

Pak

Pak

బలూచిస్తాన్‌లోని బోలాన్ జిల్లా సమీపంలో క్వెట్టా నుంచి పెషావర్ వెళ్తున్న ప్యాసింజర్ రైలును మంగళవారం ఉగ్రవాదులు కాల్పులు జరిపి హైజాక్ చేశారు. ఈ చర్యతో పాక్ ఉలిక్కిపడింది. వెంటనే రంగంలోకి దిగిన పాక్ సైన్యం రెస్య్కూ ఆపరేషన్ ప్రారంభించింది. మిలిటెంట్లు బంధించిన పాక్ ప్రజలను విడిపించేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ దాడికి పాల్పడింది తామేనని బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) ప్రకటించింది. పాక్ సైన్యం ఇప్పటివరకు 16 మంది BLA మిలిటెంట్లను హతం చేసినట్లు తెలిసింది. బందీలుగా ఉన్న100 మందికి పైగా ప్రయాణికులను పాక్ సైన్యం రక్షించింది.

Also Read:Sandeep Reddy : ప్రభాస్ కే కండీషన్లు పెడుతున్న సందీప్ రెడ్డి.. అలా ఉంటేనే ఓకే

నిన్న రాత్రి నుంచి BLA మిలిటెంట్లు, పాకిస్తాన్ సైన్యం మధ్య భారీ కాల్పులు కొనసాగుతున్నాయి. కాల్పుల్లో చాలా మంది ప్రయాణికులు కూడా గాయపడ్డారు. ఉగ్రవాదులు బందీలుగా ఉంచిన 100 మందికి పైగా ప్రజలను భద్రతా దళాలు రక్షించాయని రేడియో పాకిస్తాన్ నివేదించింది. రక్షించబడిన వారిలో 43 మంది పురుషులు, 26 మంది మహిళలు, 11 మంది పిల్లలు ఉన్నారని భద్రతా వర్గాలు తెలిపాయి. కాల్పుల్లో గాయపడిన ప్రయాణికులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. భద్రతా వర్గాల సమాచారం ప్రకారం, భద్రతా దళాల ఆపరేషన్ కారణంగా ఉగ్రవాదులు చిన్న గ్రూపులుగా విడిపోయి కాల్పులకు తెగబడుతున్నారని నివేదిక పేర్కొంది.

Also Read:Perni Nani: మచిలీపట్నంలో ఉద్రిక్తత.. వైసీపీ ఆఫీస్ ర్యాంప్ కూల్చివేత.. పేర్నినాని సీరియస్!

కాగా తమపై మిలిటరీ ఆపరేషన్ చేపడితే బందీలుగా ఉన్నవారందరినీ చంపుతామని బెదిరించింది బలూచ్ లిబరేషన్ ఆర్మీ. బందీలను విడిచిపెట్టాలంటే బలోచ్ రాజకీయ నేరస్థులు, కార్యకర్తలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీనికోసం 48 గంటల సమయం విధిస్తున్నట్లు వెల్లడించారు. బలూచ్‌ పౌరులపై పాకిస్థాన్‌ ప్రభుత్వం సాగించిన మారణకాండ, దాడులే వారు ఆ దేశం నుంచి విడిపోవాలని కోరుకోవడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.