Site icon NTV Telugu

UK: పాక్ అధికారి కవ్వింపు.. పీక కోస్తామంటూ ప్రవాస భారతీయులకు బెదిరింపు.. వీడియో వైరల్

Pak9

Pak9

యూకేలో పాకిస్థాన్ హైకమిషన్‌కు చెందిన కల్నల్ తైమూర్ రహత్ కవ్వింపు చర్యలకు పాల్పడ్డాడు. పహల్గామ్‌కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న ప్రవాస భారతీయులను ఉద్దేశించి హెచ్చరికలు జారీ చేశాడు. పీక కోస్తానంటూ బహిరంగా సైగలు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇది కూడా చదవండి: Medical Alert: జమ్మూకాశ్మీర్ ప్రభుత్వాస్పత్రులకు కీలక ఆదేశాలు.. సర్వం సిద్ధంగా ఉండాలని సర్క్యులర్ జారీ

పహల్గామ్ ఉగ్రదాడిని నిరసిస్తూ భారతీయులు లండన్‌లోని పాకిస్థాన్ హైకమిషన్ వెలుపల నిరసన ప్రదర్శన చేపట్టారు. కల్నల్ తైమూర్ రహత్ అందరూ చూస్తుండగా.. భారతీయుల పీక కోస్తామంటూ సైగలు చేసి చూపించాడు. భారత వైమానిక దళం గ్రూప్ కెప్టెన్ అభినందన్ వర్ధమాన్ చిత్రం ఉన్న ప్లకార్డును చేతిలో పట్టుకుని ప్రవాస భారయుతీలను ఉద్దేశించి ఈ సంజ్ఞ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోపై నెటిజన్లు మండిపడుతున్నారు.

ఇది కూడా చదవండి: AP Govt: మా దేశం విడిచి వెళ్లిపోండి.. ఏపీలోని పాకిస్థానీయులకు సర్కార్ హెచ్చరికలు..

ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది పౌరులు చనిపోయారు. పదులకొద్దీ గాయపడ్డారు. ఈ దాడి జరిగిన రోజే ఢిల్లీలోని పౌక్ దౌత్య కార్యాలయంలో కేక్ తెచ్చుకుని సంబరాలు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. అంటే పాక్ అధికారులు ఎంత క్రూరంగా ఉన్నారో దీనిని బట్టి అర్థమవుతోంది.

 

Exit mobile version