NTV Telugu Site icon

Pakistan: ‘‘పారిస్ మేం వస్తున్నాం’’.. నవ్వుల పాలైన పాక్ ఎయిర్‌లైన్స్ పోస్ట్‌..

Pakistan

Pakistan

Pakistan: యూరోపియన్ యూనియన్(ఈయూ) సేఫ్టీ ఏజెన్సీ పాకిస్తాన్ ఇంటర్నేషన్ ఎయిర్‌లైన్స్‌(పీఐఏ)పై విధించిన నాలుగేళ్ల బ్యాన్‌ని ఎత్తేసింది. కరాచీలో ల్యాండ్ అవుతున్న సమయంలో పీఐఏకి చెందిన విమానం 2020లో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 97 మంది ప్రయాణికులు మరణించారు. అయితే, పాకిస్తాన్ పైలెట్లకు సరైన ట్రైనింగ్ లేదని కారణంగా నిషేధాన్ని విధించింది.

Read Also: Adam Gilchrist: ఇంటికి వెళ్లి కొడుకు డైపర్లు మార్చుకో అంటూ.. టీమిండియా కెప్టెన్‭కు అవమానం

ఇదిలా ఉంటే, నిషేధం ఎత్తివేసిన తర్వాత పీఐఏ ఓ సోషల్ మీడియా పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది. ఈ పోస్టులో పాకిస్తాన్ నవ్వులపాలైంది. నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ‘‘పారిస్ మేము వస్తున్నాం’’ అంటూ పీఐఏ విమానాన్ని, ఈఫిల్ టవర్‌ని కలిగిన ఫోటోని పోస్ట్ చేసింది. అయితే, ఈ ఫోటోలో విమానం, ఈఫిట్ టవర్‌ని ఢీకొట్టేందుకు వెళ్తున్నట్లు ఉంది. దీనిపై నెటిజన్లు వ్యంగ్యంగా రియాక్ట్ అవుతున్నారు. జనవరి 10 నుండి ఇస్లామాబాద్ నుండి పారిస్‌కు విమాన ప్రయాణాన్ని ప్రారంభించడాన్ని ప్రోత్సహించే ఈ ప్రకటనలో, “పారిస్, మేము ఈరోజు వస్తున్నాము” అనే ట్యాగ్‌లైన్‌తో ఈ ఫోటోని షేర్ చేసింది.

అయితే, ఈ ఫోటో 2001లో అమెరికా ట్విట్ టవర్స్ 9/11 దాడిని గుర్తు చేస్తున్నట్లుగా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ ఈ దాడికి పాల్పడింది. మరికొందరు యూకేలో ‘‘పాకిస్తాన్ గ్రూమింగ్ గ్యాంగ్స్’’ అక్కడి బ్రిటన్ మైనర్ బాలికలపై చేసిన లైంగిక దాడులను లింక్ చేశారు. ‘‘పాకిస్తాన్ మళ్లీ అవమానం ఎదుర్కొంటోంది’’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. పీఐఏ పోస్ట్ పాకిస్తాన్ మద్దతు కలిగిన ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్‌ని గుర్తు చేస్తోందని చెప్పారు.

Show comments