NTV Telugu Site icon

TikTok: పాకిస్తాన్‌లో టిక్ టాక్ వివాదం.. సోదరిని కాల్చి చంపిన 14 ఏళ్ల బాలిక..

Tiktok

Tiktok

TikTok: పాకిస్తాన్ దేశంలో ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారామ్ టిక్‌టాక్ వివాదాస్పదమవుతోంది. అక్కడి యువత టిక్‌టాక్ బారిన పడుతోంది. ఇదిలా ఉంటే అక్కడి మతపెద్దలు మాత్రం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది ఇస్లాంకు విరుద్ధమని ఫత్వాలు జారీ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు టిక్ టాక్ వివాదం ఇద్దరు అక్కాచెల్లిళ్ల మధ్య గొడవకు కారణమైంది. 14 ఏళ్ల బాలిక, మరో సోదరిని కాల్చి చంపింది. ఈ వివాదం పాకిస్తాన్ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. టిక్ టాక్ లో వీడియో చిత్రీకరించడం ఇద్దరు సోదరీమణలు సభా అఫ్జల్, మరియా అఫ్జల్ మధ్య వివాదానికి కారణమైంది. గొడవ తర్వాత 14 ఏళ్ల సబా అఫ్జల్ తన సోదరిని కాల్చిచంపింది. ఆమె సోదరుడు సద్దర్ పోలీస్ స్టేషన్ లో సోదరుడు ఇచ్చిన ఫిర్యాదుతో ఆమెపై కేసు నమోదైంది.

Read Also: Tehreek-e-Hurriyat: కాశ్మీర్ వేర్పాటువాద సంస్థ ‘తెహ్రీక్-ఎ-హురియత్’పై కేంద్రం ఉక్కుపాదం..

అంతకుముందు.. ఇలాగే పాకిస్తాన్‌లో టిక్ టాక్ మూలంగా పలు మరణాలు సంభవించాయి. డిసెంబర్ నెలలో షేఖ్ పురా జిల్లాలో టిక్ టాక్ వీడియో చేస్తుండగా, ముగ్గురు యువకులను కార్ ఢీకొట్టింది. దీంతో వారు అక్కడిక్కడే మరణించారు. డిసెంబర్ 24న సింధ్ ప్రావిన్స్ రాజధాని కారాచీలోని ప్రముఖ మత పాఠశాల జామియా బినోరియా టౌన్, టిక్ టాక్‌ని నిషేధిస్తూ ఫత్వా జారీ చేసింది. మహిళలు అశ్లీలంగా డాన్స్ చేయడాన్ని ఓ కారణంగా ఫత్వా పేర్కొంది. అంతకుముందు 2021లో పాకిస్తాన్ టెలికమ్యూనికేషన్ అథారిటీ జూలై నుండి నవంబర్ వరకు వీడియో షేరింగ్ యాప్‌పై ఐదు నెలల నిషేధాన్ని విధించింది. ప్లాట్‌ఫారమ్‌లో అసభ్యకరమైన లేదా అనైతిక కంటెంట్‌ను నియంత్రించడానికి చర్యలు పెంచుతామని TikTok హామీ ఇచ్చిన తర్వాత నిషేధం ఎత్తివేసింది.