NTV Telugu Site icon

Pakistan: ‘టీ’ తాగడం తక్కువ చేయండి ప్లీజ్.. ప్రజలకు పాక్ మంత్రి విజ్ఞప్తి

Pak

Pak

దాయాది దేశం పాకిస్తాన్ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. ఆ దేశం దివాళా అంచున ఉంది. కొన్ని రోజుల్లో శ్రీలంక పట్టిన గతే పాకిస్తాన్ కు కూడా పట్టబోతోందని ఆర్థికరంగ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పాక్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దీంతో ఎడాపెడా డిజిల్, పెట్రోల్ రేట్లు పెంచుతోంది. దీంతో నిత్యావసరాల ధరలు కూడా పెరుగుతున్నాయి. తీవ్రమైన అప్పుల్లో కూరుకుపోయిన పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారకుండా చర్యలు తీసుకుంటుంది.

తాజాగా పాకిస్తాన్ ఫెడరల్ ప్లానింగ్ మంత్రి అహ్సాన్ ఇక్బాల్.. పాక్ ప్రజలు టీ తాగడాన్ని తగ్గించుకోవాలని సూచించారు. టీ వినియోగాన్ని 1-2 కప్పులకు తగ్గించుకోవాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో విదేశీ మారక నిల్వలు పూర్తిగా అడుగంటుకుపోతున్న నేపథ్యంలో, ఇతర దేశాల నుంచి దిగుమతి అవుతున్న టీ పొడిని తగ్గించుకోవడానికి ఈ వ్యాఖ్యలు చేశారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 400 మిలియన్ డాలర్ల విలువైన టీ పౌడర్ ను పాక్ దిగుమతి చేసుకుంది.

ప్రపంచంలో టీని ఎక్కువగా దిగుమతి చేసుకునే దేశాల్లో పాకిస్తాన్ ఒకటి. దీని కోసం ప్రస్తుతం అప్పుల చేయాల్సి వస్తోందని పాక్ మంత్రి అన్నారు. టీ వినియోగాన్ని తగ్గించుకోవాలని విజ్ఞప్తి చేయడంపై పాక్ ప్రజలు ట్విట్టర్ లో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే పాక్ లో ఇంధన సమస్య ఏర్పడింది. రాత్రి 10 తరువాత దేశ రాజధాని ఇస్లామాబాద్ లో పెళ్లి వేడుకలు చేసుకోవద్దని ప్రభుత్వం ఆదేశించింది. రాత్రి 8.30 గంటల తరువాత మార్కెట్లు మూసివేయాలని వ్యాపారులను, పాక్ ప్రణాళిక మంత్రి కోరాడు. పెట్రోలియ ఉత్పత్తుల దిగుమతిని తగ్గించుకోవడానికి ఇది సహాయపడుతుందని ఆయన అన్నారు. కఠిన నిర్ణయాలు తీసుకోకుంటే పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి శ్రీలంకలా మారతుందని ఇటీవల ఆర్థిక మంత్రి మిఫ్తా ఇస్మాయిల్ హెచ్చరించారు.

Show comments