Chinese Airlines : మనిషి అధిక బరువు ఉంటే అన్నీ సమస్యలే. మిగిలిన వారితోపాటు వారు సాధారణంగా అన్ని పనులను చేయలేరు. దీంతో వారు ఇబ్బందులను ఎదుర్కొంటూంటారు. ప్రపంచవ్యాప్తంగా ఊబకాయుల సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతూ ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి. భారతదేశం కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఇలా ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఈ ఊబకాయుల సంఖ్య పెరగడం.. అలాగే వారి సమస్యలు పెరుగుతున్నాయి. ఇపుడెందుకు దీని గురించి చెబుతున్నామంటే.. చైనాలోని ఒక విమానయాన సంస్థ అధిక బరువు ఉన్న మహిళలను సస్పెండ్ చేయాలని నిర్ణయించింది. అంటే ఎయిర్‌లైన్స్ వారు నిర్ణయించిన బరువు కంటే వారు ఎక్కువగా ఉంటే వారిని సస్పెండ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీనిని స్థానిక సిబ్బందే కాకుండా.. ఇతరులు సైతం వ్యతిరేకిస్తుండగా.. సిబ్బంది నిరసన వ్యక్తం చేస్తున్నారు.
Read also: Chiranjeevi : దటీజ్ మెగాస్టార్ చిరంజీవి అనకుండా ఉండలేరు!
ఏ సంస్థలోనైనా సంస్థ కొనసాగడం కోసం అనేక నియమ, నిబంధనలు ఉంటాయి. వీటన్నింటికి కట్టుబడి, అంగీకరించి పనిచేయడానికి ఉద్యోగులు సిద్ధంగా ఉంటారు. అయితే కొన్ని ప్రాంతాల్లో ఉద్యోగులను చాలా ఇబ్బందులకు గురిచేసే పాలసీలు కూడా ఉంటుంటాయి. దీనికి ఉదాహరణగా చైనీస్ ఎయిర్‌లైన్స్ లోని హైనాన్ ఎయిర్‌లైన్స్ కొత్త విధానం రూపొందించింది. వారు అనుసరిస్తున్న విధానాలపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. అధిక బరువు ఉన్న విమాన సిబ్బందిని సస్పెండ్ చేయాలన్న ఎయిర్‌లైన్ జూన్ ప్రారంభంలో నిర్ణయం తీసుకుంది. విమాన సిబ్బంది బరువు. నిర్ణీత పరిమితి కంటే ఎక్కువ బరువున్న మహిళా ఉద్యోగులను సస్పెండ్ చేయడం. ఇది కేవలం మహిళలకు మాత్రమే వర్తింప చేశారు. అయితే ఈ నిర్ణయంలో లింగ భేదం లేదని, నిర్ణీత బరువుకు మించిన వారిని విమానంలో పనిచేసేందుకు అనుమతించబోమని కంపెనీ వివరణ ఇచ్చింది. వ్యక్తుల ఎత్తు ఆధారంగా కంపెనీ ఈ నిర్దిష్ట శరీర బరువు పరిమితిని నిర్ణయించింది.
Read also: Koratala Siva : ‘దేవరా’ నీవే దిక్కయ్యా!
సంస్థ నిర్ణయించిన బరువు కంటే 10 శాతం ఎక్కువ శరీర బరువు ఉన్న మహిళా ఉద్యోగులను ఎయిర్‌లైన్స్ సస్పెండ్ చేస్తోంది. వీలైనంత త్వరగా వారి బరువు తగ్గించుకోవడానికి చర్యలు తీసుకోవాలని సూచిస్తుంది. ఇందుకోసం హైనాన్ ఎయిర్‌లైన్స్ ప్రతి నెలా తన క్యాబిన్ సిబ్బంది బరువును తనిఖీ చేస్తుంది. తనిఖీల్లో 5 శాతానికి మించి ఉందో లేదో చూస్తోంది. ఈ నిర్ణయంపై ప్రస్తుతం పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇది బాడీ షేమింగ్ అని చాలా మంది వాదిస్తూ.. దీనిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.