Site icon NTV Telugu

బుడతడి వయసు ఏడాది.. నెలకు రూ.75 వేల సంపాదన..!

ఆ బుడ్డోడి వయస్సు ఏడాది మాత్రమే.. అప్పుడే నెలకు రూ.75 వేలకు పైగా సంపాదిస్తున్నాడు.. ఇంతకీ.. ఏడాది వయస్సున్న చిన్నాడు.. ఏం చేస్తున్నాడు.. ఎలా సంపాదిస్తున్నాడు అనే ప్రశ్న వెంటనే బుర్రలో మెదిలిందా..? అయితే, ఆ బుడతడు ఇప్పుడు హాయిగా ఎలాంటి టెన్షన్‌ లేకుండా.. షికార్లు చేస్తున్నారు.. విమానంలో ట్రిప్పులు వేస్తూ.. పార్కులు, బీచ్‌ల్లో ఎంజాయ్‌ చేస్తున్నాడు.. ఇదేంటి..? తిరిగితే డబ్బులు ఇస్తారా? పైగా అది ఖర్చే కదా? అని మరో ప్రశ్న తలెత్తిందా? విషయం ఏంటంటే.. అతి పిన్న వయస్సుడైన టూరిస్టుగా డబ్బులు సంసాదిస్తున్నాడు.. ఏడాది వయస్సులోనే సాహస యాత్రలు చేస్తున్నాడు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అమెరికాకు చెందిన బేబీ బ్రిగ్స్‌ అనే ఏడాది వయస్సున్న బాలుడు.. ఇప్పటికే 45 సార్లు విమాన ప్రయాణం చేశాడు. యూఎస్‌లోని 16 రాష్ట్రాలను చుట్టేశాడు.. అలస్కా, కాలిఫోర్నియా, ఫ్లోరిడా, ఆరజోనా, న్యూ మెక్సికో ఇలా 16 రాష్ట్రాట్లో షికారు చేశాడు.. అక్కడి పార్కులు, బీచ్‌లు తిరుగుతూ.. తెగ ఎంజాయ్‌ చేశాడు.. ఆ చిన్నాడో తల్లిదండ్రులు అప్పుడే అన్ని ప్రాంతాలను చూపించారు.. దీంతో బ్రిగ్స్‌ అతి పిన్న వయస్కుడైన ట్రావెల్ ఇన్‌ఫ్లుయెన్సర్ అయ్యాడు.. కేవలం యునైటెడ్ స్టేట్స్ (యూఎస్‌)లో ప్రయాణించడం ద్వారా స్పాన్సర్‌షిప్‌ల నుండి నెలకు 1,000 డాలర్లు అంటే ఇండియన్‌ కరెన్సీలో సుమారు రూ. 75,000 సంపాదిస్తున్నాడు. అతని స్పాన్సర్‌షిప్‌లతో పాటు, తన డైపర్‌లు మరియు వైప్‌లను కూడా ఉచితంగా పొందుతున్నాడు. చిన్నారితో వివిధ ప్రాంతాలను చుట్టేసిన ఆమె.. ఎప్పటికప్పుడు బ్రిగ్స్‌ వీడియోలను తీసి.. సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తోంది.. ఇన్‌స్టాగ్రామ్‌లో బ్రిగ్స్‌కు 30 వేల మందికిపైగా ఫాలోవర్లు ఉన్నారు.

Exit mobile version