NTV Telugu Site icon

Craziest CT Scans: ఉడకని పంది మాంసం తిన్న వ్యక్తి.. కట్ చేస్తే, ఆస్పత్రి సీటీ స్కాన్ చూస్తే షాక్..

Parasitic Infection

Parasitic Infection

Craziest CT Scans: అమెరికాలో ఓ వ్యక్తికి సంబంధించిన సీటీ స్కాన్ వైరల్‌గా మారింది. ఉడకని పంది మాంసం తిన్న వ్యక్తి జబ్బు పడటంతో ఆస్పత్రిలో చేరాడు. అతడి సీటీ స్కాన్‌ని వైద్యులు విడుదల చేశారు. స్కాన్ రిపోర్టులో రోగి కాళ్లలో తీవ్రమైన ‘‘పరాన్నజీవి’’ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు గుర్తించారు. ఫ్లోరిడా హెల్త్ జాక్సన్‌విల్లే యూనివర్శిటీకి చెందిన ఎమర్జెన్సీ డాక్టర్ సామ్ ఘాలీ రోగికి వచ్చిన జబ్బును గుర్తించాలని స్కాన్ రిపోర్టును ఆన్‌లైన్‌లో పోస్ట్ చేశారు.

Read Also: Home Minister Anitha: భారీ వర్షాలపై అధికారులతో హోంమంత్రి అనిత సమీక్ష

రోగికి ‘‘సిస్టిసెర్కోసిస్’’ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఇది ‘‘టేప్ వార్మ్’’ అనే పరాన్నజీవి ఇన్ఫెక్షన్‌కి పేరు. పంది మాసం లేదా బీఫ్ ఇలా ఏదైనా మాంసాన్ని సరిగి ఉడికించకుండా తినడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ బారిన పడొచ్చు. ఇది ప్రమాదకమైందిగా డాక్టర్లు చెబుతున్నారు. సిస్టిసెర్కోసిస్ అనేది టైనియా సోలియం అనే క్రిమి లార్వాని తీసుకోవడం వల్ల ఏర్పడే పరాన్నజీవి సంక్రమణం. దీనిని ‘‘పోర్క్ టేప్‌వార్మ్’’ అని కూడా పిలుస్తారు.

కాబట్టి మానవులు సరిగా ఉడకని పంది మాసాన్ని తీసుకోవద్దని సూచించారు. మాంసంలో ఉండే లార్వా గుడ్లని తీసుకోవడం ద్వారా టీ సోలియం బారిన పడతారు. చాలా వారాల తర్వాత ఈ లార్వా జీర్ణశయాంతర ప్రేగుల్లోకి చేరి టేప్‌వార్మ్‌గా పరిణామం చెందుతాయి. ఈ స్థితిని ‘‘ఇంటెస్టినల్ టైనియాసిస్’’ అంటారని డాక్టర్ ఘాలి తెలిపారు. ఈ అభివృద్ధి చెందిన టేప్ వార్మ్స్ మానవ మలం ద్వారా విసర్జించబడుతాయి. ఎప్పుడైతే ఈ టేప్ వార్మ్ గుడ్లు నోటి ద్వారా శరీరంలోకి చేరుతాయో అప్పుడు ఈ సిస్టిసెర్కోసిస్ అని పిలువబడే క్లినికల్ సిండ్రోమ్ ఏర్పడుతుందని చెప్పారు.