Site icon NTV Telugu

ఒమిక్రాన్‌పై స్టడీ.. రీఇన్‌ఫెక్షన్లు ఎక్కువే..!

ద‌క్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా వేరియంట్‌ ఒమిక్రాన్‌పై ఆసక్తికరమైన విషయాలను బటయపెట్టారు ఆ దేశ శాస్త్రవేత్తలు… జట్‌ స్పీడ్‌తో ఇప్పటికే 30 దేశాలకు విస్తరించింది ఈ మహమ్మారి.. కేసుల సంఖ్య కూడా 400కు చేరువగా వెళ్లాయి.. అయితే, ఈ వేరియంట్‌పై కొంత అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు.. ఆందోళ‌న‌క‌ర‌మైన అంశాల‌ను వెల్లడించారు. ఒమిక్రాన్‌ వేగంగా వ్యాప్తిచెందడమే కాదు.. ఇన్‌ఫెక్షన్లు, రీ-ఇన్‌ఫెక్షన్లు కూడా ఎక్కువే అని తేల్చారు.. ఇప్పటి వరకు కరోనాలో వెలుగు చూసిన డెల్టా లేదా బీటా స్ట్రెయిన్ వైర‌స్‌ల‌తో పోలిస్తే.. ఒమిక్రాన్ వేరియంట్‌తో ఇన్‌ఫెక్షన్లు 3 రెట్లు అధికంగా ఉందని గుర్తించారు సౌతాఫ్రికా శాస్త్రవేత్తలు..

Read Also: భారత్‌ కరోనా అప్‌డేట్‌.. ఇవాళ 9,216 కొత్త కేసులు

ఆ దేశంలో సేక‌రించిన డేటా ఆధారంగా ఈ విష‌యాన్ని బయటపెట్టారు. ఇక, దీనికి సంబంధించిన రిపోర్ట్‌ను మెడిక‌ల్ జ‌ర్నల్‌లో అప్‌లోడ్ చేశారు శాస్త్రవేత్తలు.. అయితే, ఈ నివేదికను పరిశీలించాల్సి ఉందని చెబుతున్నారు వైద్య నిపుణులు. ఇప్పుడే వెలుగచూసిన ఒమిక్రాన్‌పై రీ-ఇన్‌ఫెక్షన్లు అంచనా వేయలేమని చెబుతున్నారు.

Exit mobile version