Site icon NTV Telugu

UNGA: వాహ్‌… ముస్లిం దేశాధినేత నోటి నుంచి ‘‘ఓం శాంతి, షాలోమ్’’..

Indonesian President

Indonesian President

UNGA: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 80వ సమావేశాల్లో ఉక్రెయిన్ యుద్ధం, గాజా యుద్ధం ముఖ్యాంశాలుగా నిలిచాయి. ప్రపంచ దేశాధినేతలు ముఖ్యంగా ఈ రెండింటిపైనే ప్రసంగించారు. అతిపెద్ద ముస్లిం దేశమైన ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ఇచ్చిన ప్రసంసం వైరల్‌గా మారింది. ఈ యుద్ధాల ముగిసి ప్రపంచంలో శాంతి నెలకొనాలని ఆయన అన్ని మతాల్లో దేవుడిని ప్రార్థించారు.

Read Also: Online Betting : ఆన్‌లైన్ బెట్టింగ్ రాకెట్‌పై సిట్- సీఐడీ సంచలన ఆపరేషన్

‘‘వస్సలం అలైకుం వరాహ్మతుల్లాహి వబారకతుహ్, షాలోం, ఓం శాంతి శాంతి శాంతి ఓం, నమో బుధయ’’ అని అన్నారు. హిందూ, ముస్లిం, బౌద్ధ సంప్రదాయాల నుంచి శుభాకాంక్షలు, శాంతి ప్రార్థనలు చేశారు. ప్రపంచంలో శాంతి కోసం ఆయన బలమైన పిలునిచ్చారు. గాజాలో లేదా పాలస్తీనాలో మరెక్కడా శాంతిని నెలకొల్పడానికి, సాయం చేయడానికి 20,000 లేదా అంతకన్నా ఎక్కువ మందిని పంపడానికి ఇండోనేషియా సిద్ధంగా ఉందని ప్రకటించారు. పాలస్తీనా, ఇజ్రాయిల్ రెండు స్వేచ్ఛగా, స్వతంత్రంగా, ఎలాంటి బెదిరింపులు ఉగ్రవాదం లేకుండా సురక్షితంగా ఉండాలని ఆయన అన్నారు.

Exit mobile version