Site icon NTV Telugu

అర్ధరాత్రి ఆ ఇంటి గోడల్లో వింత శబ్ధం… ప‌గ‌ల‌గొట్టి చూస్తే…

అది 149 ఏళ్లనాటి భ‌వంతి.  పురాతన కాలం నాటి ఇల్లు కావ‌డంతో చాలామందికి వాటిపై ఆస‌క్తి ఉంటుంది.  ఎలాగైన చేజిక్కించుకోవాల‌ని అనుకుంటారు.  ఇక‌, పాత ఇల్లు త‌క్కువ ధ‌ర‌కు వ‌స్తుంది అంతే ఎవ‌రైనా ఎందుకు వ‌దులుకుంటారు చెప్పండి.  అంద‌రిలాగే ఆ దంప‌తులు కూడా పాత ఇంటిని కోనుగోలు చేశారు.  కొంత‌కాలం హ్యాపీగానే గ‌డిచినంది.  ప్ర‌శాంతంగా ఉన్నామ‌ని అనుకుంటున్న స‌మ‌యంలో అర్ధ‌రాత్రి వేళ ఇంటి గోడ‌ల్లో నుంచి పెద్ద పెద్ద శ‌బ్ద‌లు వినిపించాయి.  దాంతో ఆ దంప‌తులు భ‌య‌ప‌డిపోయారు.  తెల్లారిన వెంట‌నే స్థానిక ప‌రిశోధ‌నా కేంద్రానికి కాల్ చేశారు.  వెంట‌నే వ‌చ్చి వారు ఆ ఇంటి గోడ‌ను బ‌ద్ద‌లు కొట్టారు.  గోడ ప‌గ‌ల‌గొట్టిన వెంట‌నే అందులోనుంచి పెద్ద సంఖ్య‌లో తేనేటీగ‌లు బ‌య‌ట‌కు వ‌చ్చేశాయి.  ఆ గోడ లోప‌ల దాదాపుగా 4 ల‌క్ష‌ల‌కు పైగా తేనెటీగ‌లు ఉన్నాయ‌ని తెలియ‌డంతో దంప‌తులు షాక్ అయ్యారు.  ఇంటి ఓన‌ర్ ఈ విష‌యం చెప్ప‌కుండా త‌మ‌కు ఇంటిని త‌క్కువ ధ‌ర‌కు అమ్మేశార‌ని ల‌బోదిబోమంటున్నారు.  ఈ సంఘ‌ట‌న అమెరికాలోని పెన్సిల్వేనియాలో జ‌రిగింది.  

Read: ‘షేరో’ పూర్తి చేసిన సన్నీ

Exit mobile version