Site icon NTV Telugu

Israel Army Chief: హమాస్‌ దాడిని నిలువరించడంలో తాము ఫెయిల్ అయ్యాం..

Israil

Israil

Israel Army Chief: అక్టోబర్‌ 7న హమాస్‌ దాడిని నిలువరించడంలో తాము విఫలమయ్యామని ఇజ్రాయెల్‌ ఆర్మీ చీఫ్ అంగీకరించారు. దీనిపై నేడు ఆ దేశ ఆర్మీచీఫ్‌ హెర్జి హలెవీ ప్రత్యేక వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియోలో ఇది సుదీర్ఘ యుద్ధం.. ఇది సైనిక సామర్థ్యాలనే కాదు.. మానసిక శక్తిని.. దీర్ఘకాలం పోరాడే సామర్థ్యాన్ని పరీక్షిస్తుందన్నారు. ప్రతిరోజు, వారం, నెలా గడిచేకొద్దీ శత్రువుల పరిస్థితి ఘోరంగా తయారవుతుందని చెప్పుకొచ్చారు. 2023 అక్టోబర్‌ 7న దాడి జరిగి ఏడాది పూర్తైంది.. ఆరోజు ప్రజలను కాపాడాల్సిన బాధ్యతల్లో మేము ఫెయిల్ అయ్యాం అని ఆయన వెల్లడించారు. మన దేశాన్ని నాశనం చేయాలని చూసేవారు ఎప్పటికీ కోలుకోలేరు.. దేశానికి ఒక తరం యోధులు, కమాండర్లు యుద్ధంతో చాలా అనుభవాన్ని సంపాదించేశారు.. హమాస్‌ సైనిక విభాగాన్ని పూర్తిగా తాము ఓడించాం.. కానీ, ఉగ్రవాద సామర్థ్యాలతో పోరాటం చేస్తున్నాం.. ఇక, హెజ్‌బొల్లా సీనియర్‌ నాయకత్వం మొత్తం తుడిచిపెట్టుకుపోయిందని ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ హెర్జి హలెవీ పేర్కొన్నారు.

Read Also: Birbhum coal Mine Blast: బొగ్గు గనిలో భారీ పేలుడు.. ఏడుగురు మృతి

కాగా, ఓవైపు గతేడాది అక్టోబర్‌ 7న హమాస్‌ చేతిలో బందీగా మారిన ఇడాన్‌ స్టీవీ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయినట్లు ఈరోజు ఇజ్రాయెల్‌ వెల్లడించింది. ప్రస్తుతం అతడి మృతదేహం కూడా హమాస్‌ దగ్గరే ఉందని చెప్పుకొచ్చింది. నోవా ఫెస్టివల్‌లో ఫొటోగ్రఫీ కోసం స్టీవీ అక్కడికి వెళ్లగా.. హమాస్‌ దళాలు దాడి చేయడంతో తన ఇద్దరు మిత్రులతో కారులో తప్పించుకొనే ప్రయత్నం చేయగా.. దీంతో మరో మార్గంలో వేగంగా వెళుతున్న వీరి కారు చెట్టును ఢీ కొనింది. ఆ తర్వాత హమాస్‌ సభ్యులు ఆ వాహనాన్ని చేరుకుని అతడి మిత్రులను కాల్చి చంపాగా.. స్టీవీని బంధించారు. ప్రస్తుతం హమాస్‌ అధీనంలో ఇంకా 97 మంది ఇజ్రాయెలీలు బందీలున్నారు.

Exit mobile version