NTV Telugu Site icon

Arab Countries: అరబ్‌ దేశాల్లో మహిళల్లో ఊబకాయం ఎక్కువ

Arab Countries

Arab Countries

Arab Countries: ముత్యాల ముగ్గు సినిమాలో రావు గోపాలరావు ఫేమస్‌ డైలాగ్‌ గుర్తుందా.. ఊరికి తిని తొంగుంటే.. మనిషికి గొడ్డుకి తేడా ఏముంటుందనే డైలాగ్‌.. గుర్తొచ్చింది కదా.. ఆ డైలాగ్‌లో ఊరికే తిని కూర్చోకుండా ఏదో ఒక పని చేయాలని చెప్పాడు. ఏ పని చేయకుండా తిని తొంగుంటే బరువు పెరిగి.. లావుగా మారుతారు. అలా లావుగా ఉండే వారిని ఊబకాయులు అంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉబకాయుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతోంది. ఊబకాయం ఇప్పుడు ప్రపంచ సమస్యగా మారింది. ఊబకాయుల సమస్యలు పెరిగిపోతున్నాయి. అయితే ఇందులో మరో ట్విస్ట్ ఉంది. అదేంటంటే ఊబకాయుల్లలో పురుషుల్లో కంటే మహిళల సంఖ్యే ఎక్కువగా ఉంది.. అవును మరీ.. పూర్తిగా చదవండి..

Read also: MLA Prasanna Kumar Reddy : చంద్రబాబు స్క్రిప్ట్ రాసిస్తే దాన్ని వారాహి ఎక్కి చదువుతున్నావ్

ప్రపంచ వ్యాప్తంగా ఊబకాయం అనేది వయసుతో సంబంధం లేకుండా వస్తోంది. చిన్న వయస్సులోనే అంటే 10 ఏళ్ల వయస్సులో కూడా ఊబకాయులు ఉంటున్నారు. ఇందులో ఫురుషులతో పోల్చితే మహిళలే ముందు స్థానంలో ఉన్నారని నివేదికలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 15 శాతం మంది స్త్రీలు ఊబకాయులుగా ఉంటే.. పురుషులు 11 శాతం మంది ఉన్నారు. సాధారణంగా బాడీ మాస్ ఇండెక్స్ (BMI) 30 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే వారిని ఊబకాయులుగా ఉర్తిస్తున్నారు. ఊబకాయంలో ఈ వ్యత్యాసం ప్రపంచవ్యాప్తంగా మారుతూ వస్తుంది. అయితే ఉత్తర ఆఫ్రికాలో పురుషులు, స్త్రీల మధ్య ఊబకాయంలో అత్యధిక తేడాలు ఉన్నాయి. దక్షిణాఫ్రికాలోని అనేక దేశాల్లో ఈ వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంది.

Read also: Royal Enfield Classic 650 Launch: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి క్లాసిక్ 650 బైక్.. ధర 3 లక్షలు!

గల్ఫ్‌ దేశాల్లోని మహిళల్లో ఊబకాయుల సంఖ్య పెరుగుతోంది. ఇందుకు కారణం ఆయా దేశాల్లోని మహిళలు ఎక్కువగా శారీరక శ్రమ చేయకపోవడమే ప్రధాన కారణంగా తెలిసింది. ఇరాన్‌లోని బాగ్దాద్‌లో నివసించే ఒక మహిళ బరువు 120 కిలోలు. ఆమె నలుగురు కూతుళ్లలో ఎవరూ పని చేయడం లేదు. వారు బరువు పెరిగే అవకాశం కూడా ఉంది. కూతుళ్లను పనికి పంపడం వల్ల మగవారి వేధింపులకు గురవుతారని భయపడి బయటికి పంపించడం లేదు. దీంతో బయటకు వెళ్లి పనిచేయరు. వారు ఇంట్లోనే ఉంటూ ఇంటి పనులు చేస్తుంటారు. వారే కాదు అరబ్ దేశాల్లో చాలామంది ఆడవారు నడకకు కూడా వెళ్ళకపోవడం, ఆహారంలో సరైన పరిమితులు లేకపోవడం వంటి పరిస్థితుల్లో.. ప్రత్యేకించి మగవారికంటే ఆడవారు బరువు పెరిగేందుకు ప్రధాన కారణంగా మారింది. అరబ్‌లోనే కాదు ప్రపంచం మొత్తం అలాంటి పరిస్థితి నెలకొంది. ఉదయం నిద్ర లేచి మంచం మీద నుండి కాలు క్రింద పెట్టినప్పటి నుండి తిరిగి రాత్రి మంచం మీదకి చేరేంతవరకు నిత్యజీవితంలో మనిషికి కావలసిన అన్ని విషయాలల్లోనూ సౌకర్యాలు పెరిగి పోయాయి. మనిషి చేసే ప్రతి పనిని యంత్రాలు పూర్తి చేస్తున్నాయి. మగవారు వృత్తి, వ్యాపారం, తీసుకునే ఆహారం, పని చేసే విధానం ఆడవారితో పోల్చితే భిన్నంగా ఉంటుంది. అందువలన వారు మహిళల కంటే కొంత బరువు తక్కువగానే ఉంటారు. ఎవరైనా బరువు పెరిగినట్టు అనిపిస్తే దానిని తగ్గించుకోవడానికి నానా తంటాలు పడతారు. బరువు తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే బరువుతగ్గాలని అప్పటికప్పుడు అనుకుని చేసే ప్రయత్నాలన్నీ ఇబ్బందులనే తెచ్చిపెడతాయి.