NTV Telugu Site icon

North Korea: విదేశీ టూరిస్టులకు శుభవార్త చెప్పిన నియంత కిమ్..

Samjiyon

Samjiyon

North Korea: ఉత్తర కొరియా అధ్యక్షడు కిమ్ జోంగ్ ఉన్ ఆ దేశాన్ని సందర్శించాలనుకునే విదేశీ టూరిస్టులకు శుభవార్త చెప్పాడు. డిసెంబర్ నెల నుంచి ఈశాన్య నగరమైన సంజియోన్‌కి అంతర్జాతీయ పర్యాటకాన్ని పున:ప్రారంభించనుందని, దేశంలోని మిగతా ప్రాంతాలకు కూడా ఇదే సమయంలో పర్యాటకాన్ని అతనుమతించవచ్చని ఆ దేశ టూరిస్ట్ కంపెనీలు బుధవారం చెప్పాయి. కఠినమైన కోవిడ్ నిబంధనల కారణంగా ఆ దేశం తన సరిహద్దుల్ని మూసేసింది. ప్రస్తుతం కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో ప్రపంచంలోనే అత్యంత నిగూఢమైన దేశం పర్యాటకుల్ని ఆహ్వానిస్తోంది.

Read Also: Mamata Banerjee: సీబీఐకి మమతా అల్టిమేటం.. ఆదివారంలోగా వైద్యురాలికి న్యాయం జరగాలి..

“సమ్‌జియోన్‌కు పర్యాటకం మరియు దేశంలోని మిగిలిన ప్రాంతాలు అధికారికంగా 2024 డిసెంబర్‌లో తిరిగి ప్రారంభమవుతాయని మా స్థానిక భాగస్వామి నుండి మేము ధృవీకరణ పొందాము” అని బీజింగ్‌కు చెందిన కొరియో టూర్స్ తన వెబ్‌సైట్‌లో తెలిపింది. ఉత్తర కొరియా గత సంవత్సరం అంతర్జాతీయ విమాన సర్వీసుల్ని పునరుద్ధరించింది. రష్యన్ పర్యాటకులు ఫిబ్రవరిలో ప్రైవేట్ పర్యటన కోసం ఉత్తర కొరియా వెళ్లారు. జూన్ నెలలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌‌తో సహా విదేశీ ఉన్నతాధికారులు ఆ దేశాన్ని సందర్శించారు.

2020 నుంచి ఉత్తర కొరియా అంతర్జాతీయ పర్యాటకుల్ని నిషేధించింది. తాజాగా కోవిడ్ తగ్గడంతో తమ దేశానికి అంతర్జాతీయ టూరిస్టుల్ని ఆహ్వానిస్తోంది. ఈ ప్రకటన కోసం దాదాపు 4 ఏళ్లుగా వేచి ఉన్నట్లు కొరియో టూర్స్ ఆనందం వ్యక్తి చేసింది. ప్రస్తుతం ఉత్తర కొరియాలోని సంజియోన్ నగరం చైనా సరిహద్దులకు దగ్గర ఉంది. ఈ ప్రాంతంలో కొత్త అపార్ట్మెంట్లు, స్కీ రిసార్టులు, హోటళ్లు ఏర్పాటు అయ్యాయి. ఇదిలా ఉంటే తన కలల ప్రాజెక్టుగా ఉన్న సంజియోన్ నగర డెవలప్‌పై బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన ఆరోపణలపై కిమ్ జోంగ్ ఉన్ కొంత మంది సీనియర్ అధికారుల్ని తొలగించారు. మరో ట్రావెల్ ఏజెన్సీ KTG టూర్స్ కూడా ఈ శీతాకాలం నుండి పర్యాటకులు సంజియోన్‌కు వెళ్లవచ్చని ప్రకటించింది.

Show comments