Ukraine Russia War: రష్యాకు షాక్‌ ఇచ్చిన మరో కీలక సంస్థ..!

Nokia

Nokia

ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.. ఓవైపు శాంతి చర్చలు అంటూనే.. మరోవైపు అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్ర ఆంక్షలు ఎదురవుతున్నా.. యుద్ధం కొనసాగిస్తోంది రష్యా.. ఈ నేపథ్యంలో చాలా సంస్థల ఆ దేశానికి గుడ్‌బై చెప్పేస్తున్నాయి.. తాజాగా, రష్యాకు ప్రముఖ టెలికం పరికరాల తయారీ సంస్థ నోకియా షాక్‌ ఇచ్చింది. రష్యా మార్కెట్‌ నుంచి నిష్క్రమిస్తున్నట్టు ప్రకటించింది. ఇకపై రష్యా విపణిలో తమ ఉత్పత్తులను విక్రయించబోమని తేల్చి చెప్పింది. ఫిన్లాండ్‌కు చెందిన ఈ దిగ్గజ కంపెనీ.. యుద్ధం మొదలైన తొలి రోజుల్లోనే రష్యాలో తమ ఉనికి సాధ్యం కాదని అర్థమైందని పేర్కొంది. అందుకే మార్చి నుంచే డెలివరీలతో పాటు కొత్త వ్యాపారాలను నిలిపివేశామనీ.. రీసెర్చి, డెవలప్‌మెంట్‌ కార్యకలాపాలను గత కొన్ని వారాలుగా రష్యానుంచి తరలించినట్టు చెప్పింది.

Read Also: Pranahita Pushkaralu: నేటి నుంచి ప్రాణహిత పుష్కరాలు.. ఏర్పాట్లపై విమర్శలు..