Site icon NTV Telugu

Nobel Prize 2022: కెమిస్ట్రీలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్.. “క్లిక్ కెమిస్ట్రీ” పరిశోధనలకు ప్రైజ్

Nobel Prize 2022

Nobel Prize 2022

Nobel Prize 2022: రసాయన శాస్త్రంలో విశేష కృషికి గానూ.. ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి వరించింది. క్లిక్ కెమిస్ట్రీ, బయో ఆర్తోగోనల్ కెమిస్ట్రీ అభివృద్ధికి గానూ కరోలిన్ బెర్టోజీ, మోర్టెన్ మెల్డార్, బారీ షార్ప్‌లెస్ నోబెల్ బహుమతి అందుకున్నారు. ఇంజనీరింగ్ టూల్స్ ఫర్ మాలుక్యూల్స్ బిల్డింగ్స్ పై వీరంతా పరిశోధనలు చేశారు. బారీ షార్ప్ లెస్, మోర్టెన్ మెల్డల్ క్లిక్ కెమిస్ట్రీ క్రియాత్మక రూపానికి పునాది వేశారు. పరమాణు బిల్డింగ్స్ బ్లాక్స్ పై పరిశోధనలు చేశారు. కరోలిన్ బెర్టోజీ వీటిని జీవులలో ఉపయోగించడం ప్రారంభించారు.

Read Also: BRS Party Sambaralu Live: బీఆర్ఎస్ పార్టీ ప్రకటనతో సంబరాలు

ఇప్పటికే నోబెల్ కమిటీ సోమవారం వైద్యరంగం, మంగళవారం ఫిజిక్స్, తాజాగా బుధవారం కెమిస్ట్రీలో నోబెల్ బహుమతులను ప్రకటించింది. గురువారం సాహిత్యానికి, శుక్రవారం శాంతి బహుమతి, అక్టోబర్ 10న ఆర్థిక రంగంలో నోబెల్ బహుమతులు ప్రకటిస్తారు. 2021లో బెంజమిన్ లిస్ట్, డేవిడ్ మాక్ మిలన్ లకు సంయుక్తంగా రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతిని ప్రకటించారు. పరమాణు నిర్మాణం కోసం కొత్త సాధనం ఆర్గానో క్యాటాలిసిస్ ను అభివృద్ధి చేసినందుకు నోబెల్ బహుమతి అందించారు.

నోబెల్ బహుమతి గ్రహీతలకు 10 లక్షల స్వీడిష్ క్రోనార్స్( 9 లక్షల డాలర్లు) నగదును అందచేస్తారు. వీటిని ఈ ఏడాది డిసెంబర్ 10న అవార్డు గ్రహీతలకు అందచేస్తారు. స్వీడిష్ ఇంజినీర్ ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ పేరు మీద రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఈ నోబెల్ బహుమతులను అందిస్తోంది. ఇప్పటి వరకు కెమిస్ట్రీలో 113 మందికి నోబెల్ బహుమతులు రాగా.. అందులో ఏడుగురు మహిళలు ఉన్నారు.

 

Exit mobile version