NTV Telugu Site icon

తాలిబన్లతో చర్చలు అనసరం: ఐరోపా సమాఖ్య

అఫ్ఘానిస్థాన్‌ దేశాన్ని ఆక్రమించుకొన్న కొద్ది రోజుల్లోనే తాలిబన్ల పాలన ఎంత దారుణంగా ఉంటుందో ప్రపంచానికి తెలుస్తోంది. కాబుల్‌లో అడుగడుగునా మోహరించిన తాలిబన్లు విధ్వంసాలకు తెగబడుతున్నారు. ఇదిలావుంటే, అఫ్ఘానిస్థాన్‌లో తాలిబన్ల పాలనను తాము గుర్తించలేదని యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు అర్సులా వాన్ డెర్ లియన్ తెలిపారు. తాలిబన్లతో ప్రస్తుతం ఎటువంటి చర్చలు జరపట్లేదని, అది అనవసరం కూడా అని ఆమె స్పష్టం చేశారు. అఫ్ఘానిస్థాన్ నుంచి తిరిగొచ్చిన ఐరోపా సమాఖ్య ఉద్యోగుల కోసం మాడ్రిడ్ నగరంలో ఏర్పాటు చేసిన శిబిరాన్ని ఆమె నేడు సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మానవతా ధృక్పథంతో అఫ్ఘానిస్థాన్‌కు అందిస్తున్న సాయాన్ని మరింత పెంచాలని అభిప్రాయపడ్డారు.