NTV Telugu Site icon

Xi Jinping: “ఎవరూ ఆపలేరు”.. న్యూఇయర్ సందేశంలో తైవాన్‌కి చైనా వార్నింగ్..

Xi Jinping

Xi Jinping

Xi Jinping: తైవాన్‌కి చైనా అధ్యక్షుడు జి జిన్ పింగ్ వార్నింగ్ ఇచ్చారు. కొత్త ఏడాది సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన ‘‘ పునరకీకరణను ఎవరూ ఆపలేరు’’ అని అన్నారు. గత కొంత కాలంగా చైనా, తైవాన్‌ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తోంది. తైవాన్ చుట్టూ చైనీస్ మిలిటరీ కాపు కాస్తోంది. ఈ నేపథ్యంలో జిన్‌పింగ్ వ్యాఖ్యలు చైనా వ్యూహాన్ని స్పష్టం చేశాయి.

Read Also: November 2024 Movie Roundup:సుబ్బరాజు పెళ్లి, అక్కినేని అఖిల్ నిశ్చితార్థం, రెహమాన్ విడాకులు

చైనా, తైవాన్ వేరు కాదని ఈ రెండు దేశాలు కూడా ఒకే జీనవ విధానాన్ని సూచిస్తాయని పలు సందర్భాల్లో చైనా వ్యాఖ్యానించింది. ‘‘వన్ చైనా’’ విధానంలో తైవాన్ కూడా భాగమే అని చెబుతోంది. మే నెలలో తైవాన్ ప్రజాస్వామ్య ఎన్నికల్లో అధ్యక్షుడిగా లాయ్ చింగ్ తే అధికారంలోకి వచ్చిన తర్వాత చైనా మూడు సార్లు తైవాన్ చుట్టూ సైనిక కసరత్తులు నిర్వహించింది. తైవాన్‌ని బలప్రయోగం ద్వారా తన ఆధీనంలోకి తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తోంది. పలుమార్లు చైనా ఎయిర్‌ఫోర్స్ తైవాన్ గగనతలాన్ని ఉల్లంఘించింది.

చైనా అధ్యక్షుడు జిన్ ‌పింగ్ న్యూ ఇయర్ ప్రసంగంలో మాట్లాడుతూ.. “తైవాన్ జలసంధికి ఇరువైపులా ఉన్న చైనా ప్రజలు ఒకే కుటుంబం. మన రక్త సంబంధాలను ఎవరూ తెంచలేరు మరియు మాతృభూమి పునరేకీకరణ యొక్క చారిత్రక ధోరణిని ఎవరూ ఆపలేరు” అని అన్నారు. డొనాల్డ్ ట్రంప్ మరో మూడు వారాల్లో అధికారంలోకి రాబోతున్న తరుణంలో జిన్ పింగ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తైవాన్‌‌ని అమెరికా ఆసియాలో వ్యూహాత్మక మిత్రదేశంగా భావిస్తోంది. అమెరికా తైవాన్‌కి అతిపెద్ద ఆయుధ సరఫరాదారుగా ఉంది. తైవాన్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉంటే, చైనాలో ఏక పార్టీ ప్రభుత్వమైన కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఉంది. చైనా నుంచి తైవాన్‌ని రక్షించేందుకు అమెరికా అండగా నిలుస్తోంది.

Show comments