Site icon NTV Telugu

నీరవ్‌ మోడీ సంచలనం.. భారత్‌కు అప్పగిస్తే ఆత్మహత్యే..!

Nirav Modi

Nirav Modi

బ్యాంకులకు వేల కోట్ల ఎగనామం పెట్టి విదేశాలకు చెక్కేసిన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోడీని చివరకు లండన్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు.. ఇక, ఆయన్ను భారత్‌కు అప్పగించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి.. ఈ వ్యవహారంపై లండన్‌ కోర్టులో అప్పీల్‌కు వెళ్లిన నీరవ్ మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు.. తనను భారత్‌కు అప్పగించొద్దని కోర్టుకు కోరిన నీరవ్… తనను భారత్‌కు అప్పగిస్తే ఆత్మహత్యే శరణ్యమన్నారు. కాగా, కొద్ది రోజుల క్రితం నీరవ్‌కు లండన్‌ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. హైకోర్టు అప్పీల్‌కు కోర్టు తిరస్కరించింది. ఫలితంగా ఇండియాకు అప్పగించే మార్గం సుగమం అయ్యింది. బ్యాంకులకు రూ.13వేల 700 కోట్ల రూపాయల మేర మోసానికి పాల్పడి పారిపోయిన నీరవ్ మోడీ.. దేశంలోని ఆర్థిక నేరాల్లో నిందితుడు కావడంతో.. ఆయన్ను భారత్‌కు అప్పగించాలని లండన్‌లోని వెస్ట్‌ మినిస్టర్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు ఫిబ్రవరిలో ఆదేశాలిచ్చింది. ఇండియాలో మనీల్యాండరింగ్, నమ్మకద్రోహం వంటి నేరారోపణలను ఎదుర్కోవాల్సిందేనని తేల్చిచెప్పింది. కానీ, ఇప్పుడు కోర్టును ఆశ్రయించిన నీరవ్ మోడీ.. సంచలనం వ్యాఖ్యలు చేయడం చర్చగా మారింది.

Exit mobile version