NTV Telugu Site icon

Nigeria: మరణించిన ఏడాదికి నైజీరియా ఫ్లాగ్ డిజైనర్ అంత్యక్రియలు

Nigerianflagdesigner

Nigerianflagdesigner

నైజీరియన్ ఫ్లాగ్ డిజైనర్ పా తైవో మైఖేల్ అకిన్‌కున్మీ అంత్యక్రియలు ఏడాది తర్వాత కుటుంబ సభ్యులు పూర్తి చేశారు. 87 సంవత్సరాల వయస్సులో ఆగష్టు 29, 2023న అకిన్‌కున్మీ మరణించారు. అయితే ప్రభుత్వం గౌరవప్రదంగా ఖననం చేసేందుకు ముందుకు రాలేదు. దీంతో మృతదేహాన్ని కుటుంబ సభ్యులు ఏడాది పాటు మార్చురీలోనే ఉంచారు. తాజాగా ప్రభుత్వం గౌరవప్రదంగా అంత్యక్రియలు చేయడానికి ముందుకు రావడంతో ఇప్పుడు పూర్తి చేశారు.

ఇది కూడా చదవండి: Fennel seeds: భోజనం తర్వాత సోంపు తింటే ఎన్ని లాభాలో!

1950ల చివరలో లండన్‌లో చదువుతున్నప్పుడు అకింకున్మి ఆకుపచ్చ-తెలుపు జెండాను సృష్టించాడు. నైజీరియా యొక్క వ్యవసాయ సంపద, దాని విభిన్న జాతుల మధ్య శాంతి మరియు ఐక్యతకు ప్రతీకగా జెండాను డిజైన్ చేశాడు. జాతీయ పోటీలో ఆకట్టుకుంది. అక్టోబర్ 1, 1960న నైజీరియా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ జెండా ఆవిష్కరించబడింది. దేశం యొక్క గుర్తింపు కోసం అతను గణనీయమైన కృషి చేసినప్పటికీ అకింకున్మి నిశ్శబ్దంగా జీవించాడు.

ఇది కూడా చదవండి: Ganesh Chaturthi : ఎలాంటి గణేషుడి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే మంచిది?.. ప్రతిష్ఠాపన విధానం.. శుభ ముహూర్తం?

2014లో నైజీరియా యొక్క అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫెడరల్ రిపబ్లిక్ (OFR)తో సత్కరించబడ్డాడు. అకిన్‌కున్మి మరణం తర్వాత ఖననం కోసం ప్రభుత్వం సరిగ్గా స్పందించకపోవడంతో కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఒక సంవత్సరం పాటు మార్చురీలో ఉంచవలసి వచ్చింది. ప్రజల నిరసన వ్యక్తం కావడంతో ప్రభుత్వం స్పందించి ముందుకొచ్చింది. మొత్తానికి ఏడాది తర్వాత అంత్యక్రియులు పూర్తయ్యాయి.