NTV Telugu Site icon

Khalistan: లష్కరేతోయిబా, దావూద్‌తో ఖలిస్తాన్ లింకులు..

Khalistan

Khalistan

Khalistan: భారతదేశంలో వేర్పాటువాదాన్ని ప్రోత్సహించేలా ఖలిస్తాన్ ఉగ్రసంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా కెనడా, యూకే, అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో రాడికల్ సిక్కులు భారతదేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఇటీవల ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య చేయబడ్డాడు. ఇతను కూడా ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్(కేటీఎఫ్)పేరుతో ఉగ్రవాద సంస్థను నడుపుతున్నారు. కెనడాలో సర్రే ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు ఇతడిని కాల్చి చంపారు. అయితే ఖలిస్తాన్ ఉగ్రసంస్థలకు, వేర్పాటువాదులకు పాకిస్తాన్ ఐఎస్ఐ సాయం చేస్తుందని ఎప్పటి నుంతో తెలుసు.

ఇదిలా ఉంటే తాజాగా ఖలిస్తానీ ఉగ్రసంస్థలకు నిషేధిత లష్కరేతోయిబా ఉగ్రవాద సంస్థతో పాటు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో సంబంధాలు ఉన్నట్లు తేలింది. జాతీయ దర్యాప్తు సంస్థ( ఎన్ఐఏ) ఈ సంబంధాలను వెలుగులోకి తీసుకువచ్చింది. ఇవి యూరప్, కెనడాల్లో ఖలిస్తానీ ఉద్యమం, భారత వ్యతిరేక కార్యకలాపాలకు ఎలా మూలాధారంగా మారాయనే దానిపై విచారణ మరింత లోతుగా సాగుతోంది.

Read Also: Virat Kohli: ఆసీస్ ప్లేయర్లను టీజ్ చేసిన విరాట్ కోహ్లీ

నిషేధిత బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్(బీకేఐ) యూరప్, ఉత్తర అమెరికాలో నివసిస్తున్న సిక్కుల నుంచి నిధులను అందుకుని వాటిని భారత వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగిస్తోంది. కెనడాల్లోని వివిధ నగరాల్లో సిక్కు ర్యాలీలు నిర్వహించి నిధుల సేకరిస్తోందని తేలింది. ఇండియా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది దావూద్ ఇబ్రహీంతో బబ్బర ఖల్సాకు సంబంధాలు ఉన్నాయి. దీంతో పాటు లష్కరే తోయిబా, ఇండియన్ ముజాహీదీన్ వంటి ఉగ్రసంస్థలతో బీకేఐ సంబంధాలు నెరుపుతోంది.

2002లో బీకేఐ నాయకుడు లఖ్బీర్ సింగ్ కి సన్నిహితుడైన ఇక్బాల్ బంటీ, అబ్దుల్ కరీం తుండాను కరాచీలోని దావూద్ నివాసంలో తీసుకువచ్చి సమావేశం నిర్వహించినట్లు వెల్లడైంది. బీకేఐ పాకిస్తాన్ తో పాటు అమెరికా, కెనడా, యూకే, బెల్జియం, ఫ్రాన్స్, జర్మనీ, నార్వే, స్విట్జర్లాండ్ లలో క్రియాశీలకంగా ఉంది. ఇది ప్రపంచ భద్రతకు ముప్పును కలిగిస్తోంది. పాక్ గూఢాచర సంస్థ ఐఎస్ఐ మద్దతుతో బీకేఐ తన కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.