New Zealand: న్యూజిలాండ్ హాస్టల్ భవనంలో అగ్ని ప్రమాదం.. 10 మంది మృతి.. 11 మంది గల్లంతు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New Zealand: న్యూజిలాండ్‌లోని నాలుగు అంతస్తుల హాస్టల్ భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంలో పది మంది మృతిచెందినట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మరో 11 మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. హాస్టల్‌లో 92 గదులు ఉన్నాయి. నిర్మాణ రంగానికి చెందిన వారు, ఆసుపత్రి సిబ్బంది, ఇతర రంగాలకు చెందిన వారు కూడా ఆ హాస్టల్‌లో ఉంటున్నారు. అగ్నిప్రమాదంలో తమ వస్తువులన్నీ పోయాయని కొందరు తెలిపారు. హాస్టల్‌లో 52 మంది ఉన్నట్లు తెలుస్తోంది. అగ్ని ప్రమాదంపై అనుమానాలున్నాయని అగ్నిమాపక, అత్యవసర అధికారులు చెబుతున్నారు. చాలా మంది బహిష్కృతులు ఆ హాస్టల్‌లో ఉంటున్నారని, చాలా మంది మిస్ అయినట్లు న్యాయవాది ఫిలిప్పా పెయిన్ చెప్పారు. అర్ధరాత్రి దాటిన తర్వాత లోఫర్స్ లాడ్జ్ పైఅంతస్తులో మంటలు చెలరేగాయని పేర్కొన్నారు. దీంతో స్థానిక సమాచారంతో ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులో తీసుకువచ్చారని అన్నారు. కొందరిని కాపాడారని మరికొందరు గల్లంతైనట్లు తెలిపారు.
ప్రధానమంత్రి క్రిస్ హిప్కిన్స్ ఒక టెలివిజన్ షోతో మాట్లాడుతూ ఆరుగురు మరణించారని, మృతుల సంఖ్య 12 కంటే తక్కువగా ఉంటుందని పోలీసులు తెలిపారు. భవనంలో 92 గదులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. భవనంలోకి ప్రవేశించేంత వరకు ఆ భవనం ఎంత సురక్షితంగా ఉందో వారికి తెలియదు. అంతేకాదు భవనం పైకప్పు కూలిపోయే ప్రమాదం ఉందన్నారు. అందులో ఇప్పటి వరకు 52 మంది ఉన్నట్లు గుర్తించారు. ఈ ప్రమాదంలో నష్టపోయిన వారందరికీ ఇది ఒక విషాదకరమైన సంఘటన అన్నారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను అని జిల్లా మేనేజర్ కమాండర్ నిక్ ప్యాట్ ఒక ప్రకటనలో తెలిపారు. వెల్లింగ్టన్‌లో ఒక దశాబ్దంలో అత్యంత ఘోరమైన అగ్నిప్రమాదమని. ఇది భయంకమైన ఓపీడకల అని ఆయన అన్నారు.
Sirivennela: సీతారామశాస్త్రి పై రెండు పుస్తకాలు!
Also Read
- Turkey-UN: టర్కీ బుద్ధి మారలేదు.. యూఎన్‌లో పాక్‌కు మద్దతుగా కాశ్మీర్ ప్రస్తావన
- Pezeshkian: ‘మేము ఉగ్రవాదులం కాదు.. బాధితులం’.. యూఎన్‌లో ఫొటోలు చూపించి ఇరాన్ అధ్యక్షుడు ప్రసంగం
- Jaishankar-Rubio: రూబియోతో జైశంకర్ భేటీ.. రష్యా ఆంక్షల బిల్లుపై అభ్యంతరం
- Ukraine War: ఉక్రెయిన్‌లో తుస్సుమన్న పాకిస్తానీ మందుగుండు..
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!