అమెరికాలో డెల్మిక్రాన్ కలకలం…!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా, బ్రిటన్‌లో కరోనా కేసులు మళ్లీ పీక్స్‌కు చేరుతున్నాయి. అగ్రరాజ్యంలో ఒక్కరోజే నమోదైన కొత్త కేసులు 2 లక్షల మార్క్‌ను దాటేయగా… బ్రిటన్‌లో వరుసగా రెండోరోజూ లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ లేటెస్ట్ వేవ్ వెనుక డెల్మిక్రాన్ ఉండొచ్చనే వాదనను తెరపైకి తెచ్చారు… నిపుణులు.
అమెరికాలో 24 గంటల్లో 2 లక్షల 65 వేల 32 మందికి కొవిడ్ సోకింది. ఈ ఏడాది జనవరి, సెప్టెంబర్ తర్వాత మళ్లీ ఈ స్థాయిలో కేసులు రావడం ఇదే తొలిసారి. అమెరికాలో ఒమిక్రాన్ బారినపడే వారి సంఖ్య కూడా 73 శాతానికి పెరిగింది. ఇక బ్రిటన్‌లోనూ ఒక్కరోజే దాదాపు లక్షా 20 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. అక్కడ వరుసగా రెండోరోజు లక్షకు పైన కేసులు తేలాయి. ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ, కెనడాల్లోనూ కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ తాజా వేవ్ వెనుక డెల్మిక్రాన్ ఉందని నిపుణులు అంటున్నారు.
Also Read
డెల్టా వేరియంట్‌ను, ఒమిక్రాన్‌ను కలిపి డెల్మిక్రాన్‌గా పిలుస్తున్నారు. ఇది కొత్త వేరియంట్ కాకపోయినా… డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్ల స్పైక్ ప్రొటీన్ల కలయికగా నిపుణులు చెప్తున్నారు. ఒక వ్యక్తికి ఒకే సమయంలో డెల్టాతో పాటు ఒమిక్రాన్ కూడా సోకితే డెల్మిక్రాన్‌గా పరిగణిస్తారు. అలాగే డెల్టా నుంచి కోలుకుంటున్న వ్యక్తికి .. ఒమిక్రాన్ సోకితే డెల్మిక్రాన్ ఇన్ఫెక్షన్‌గా చెబుతారు. ఇది చాలా అరుదుగా జరగొచ్చని నిపుణులు అంటున్నారు. ఒకటి కంటే ఎక్కువ కరోనా వైరస్ వేరియంట్ల బారినపడిన వారికి దగ్గరగా వెళ్లిన వారిలో ఇలాంటి పరిస్థితి తలెత్తవచ్చని చెబుతున్నారు.
డెల్టా, ఒమిక్రాన్ బారినపడిన వ్యక్తుల్లో కాస్త అటూ ఇటుగా ఒకే రకమైన లక్షణాలు ఉంటున్నాయి. జ్వరం, దగ్గు, జలుబు, తలనొప్పి వంటివి వస్తున్నాయి. డెల్టా కంటే ఒమిక్రాన్ వ్యాధి తీవ్రత తక్కువగానే ఉండటంతో ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య, మరణాలు స్వల్పంగానే ఉన్నాయి. అయితే, రోగనిరోధక శక్తి లేకపోవడం, వృద్ధాప్యం, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి… డబుల్ ఇన్ఫెక్షన్‌తో ముప్పు ఎక్కువగా ఉండొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందరూ కొవిడ్ నియమావళిని పాటించడం, టీకాలు తీసుకోవడం ద్వారా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయొచ్చని సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!