Site icon NTV Telugu

COVID-19: కరోనా వేరియంట్లపై అధ్యయనం.. కారణం ఇదే..!

covid

covid

ప్రపంచ దేశాలపై కరోనా ప్రభావం అంతా ఇంత కాదు.. వైరస్‌ సృష్టించిన విలయానికి ఇప్పటికీ కోలుకోలేకపోతున్నాం. అయితే ప్రస్తుతం చోటుచేసుకుంటోన్న వాతావరణ మార్పులు తదుపరి వైరస్‌కి కారణమవుతన్నాయని తాజా అధ్యయనం అంచనా వేసింది. విపరీతంగా పెరుగుతోన్న ఉష్ణోగ్రతలతో అడవి జంతువులు జనావాస ప్రాంతాల్లోకి తరలి రావడం, దాంతో వైరస్‌లు జంతువుల నుంచి మానవులకు సోకడంతో మరో మహమ్మారి ముప్పును పెంచుతున్నట్లు నివేదికలో వెల్లడైంది.

Read Also: Honour Killing: పరువు హత్యపై ఒవైసీ రియాక్షన్

జంతువులను ఒకేచోట చేర్చడంతో అత్యవసర పరిస్థితులకు కారణమ్యే ప్రమాదాలను సృష్టిస్తుందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా గబ్బిలాల నుంచి మధ్యంతర జీవులకు, అక్కడనుంచి ప్రజలకు వైరస్‌ సోకే పరిస్థితులకు దారితీస్తాయని చెబుతున్నారు. ఎబోలా, కరోనా వంటి వైరస్‌లు కొత్త ప్రాంతాల్లో విస్తరించడానికి ఇవి అవకాశం కల్పించే ప్రమాదం ఉందన్నారు. దాంతో మూలాలను గుర్తించలేని విధంగా మారడంతోపాటు వన్యప్రాణుల నుంచి మానవులలోకి వైరస్‌లు ప్రవేశించేందుకు వాతావరణ మార్పులు కారణమవుతున్నాయని చెప్పుకొచ్చారు.

ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం వేడి వాతావరణం ఉన్న కారణంగా ఈ ప్రక్రియ ఇప్పటికే మొదలుకావచ్చన్న శాస్త్రవేత్తలు.. భూతాపం తగ్గించడం వల్ల ఈ ప్రమాదాన్ని ఆపలేకపోవచ్చని చెబుతున్నారు. అధిక ఉష్ణోగ్రతల పెరుగుదల గబ్బిలాలపై ప్రభావం చూపించవచ్చని.. దాంతో సుదూరు ప్రాంతాలకు తరలివెళ్లే సామర్థ్యం కారణంగా వైరస్‌ల విస్తరణ మరింత ఎక్కువగా ఉంటుందంటున్నారు.

Exit mobile version