Langya henipa virus: చైనాలో మరో కొత్త వైరస్.. లక్షణాలు ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Langya henipa virus: చైనాలో మరో కొత్త వైరస్ వెలుగులోకి వచ్చింది. లివర్, కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపే లాంగ్యా హెనిపావైరస్ అనే కొత్త జూనోటిక్ వైరస్‌ను చైనా గుర్తించింది. ఈ కొత్త వైరస్ ఇప్పటికే 35 మందికి సోకినట్లు సైంటిస్టులు గుర్తించారు. లాంగ్యా వైరస్ జంతువుల నుంచి మనుషులకు ఇది వ్యాపించి ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కొత్త వైరస్ ఇప్పటివరకు ఒకరి నుంచి మరొకరికి సోకిందనడానికి ఎలాంటి ఆధారాలు దొరకలేదని, మరిన్ని పరిశోధనలు జరుగుతున్నాయని, అప్పటివరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ నేపథ్యంలో వైరస్ సోకిన వారికి దూరంగా ఉండాలని ప్రజలకు అధికారులు సూచించారు. జ్వరం, అలసట, దగ్గు, కండరాల నొప్పి, ఆకలి లేకపోవడం, తలనొప్పి, వాంతులు ఈ వైరస్ లక్షణాలు. తూర్పు చైనాలో అనారోగ్యం పాలైన కొందరి నమూనాలు పరిశీలించగా కొత్త లాంగ్యా హెనిపావైరస్ (LayV) గుర్తించబడిందని ఓ అధ్యయనం తెలిపింది.
Kim JOng Un: తీవ్ర అనారోగ్యం బారిన పడిన కిమ్..
Also Read
- Pentagon Lockdown: పెంటగాన్‌లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
- UK: ప్రధాని కీర్ స్టార్మర్తో వాగ్వాదం.. రక్షణ మంత్రి జాన్ హీలీ రాజీనామా
- Iran-US: ఈసారి బాధాకరమైన పరిణామాలుంటాయి.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్
- Trump: ఈ రాత్రి ఇరాన్‌ను ఊహించలేని దెబ్బ కొడతాం.. ఖర్గ్ కూడా స్వాధీనం చేసుకుంటాం.. ట్రంప్ వార్నింగ్
చైనాలోని షాన్‌డాంగ్, హెనాన్ ప్రావిన్స్‌లలో లాంగ్యా వైరస్ సోకిన 35 మంది రోగులను గుర్తించారు. వీరిలో 26 మందిలో జ్వరం, అలసట, దగ్గు, కండరాల నొప్పి, ఆకలి లేకపోవడం, తలనొప్పి, వాంతులు లక్షణాలు ఉన్నట్లు పేర్కొన్నారు. వారు సన్నిహితంగా ఉన్నవారిలో ఈ లక్షణాలు లేవని.. అంటే మనిషి నుంచి మనిషికి వ్యాప్తి మెల్లగా ఉండొచ్చని సూచిస్తుందన్నారు. 15 మంది బాధిత కుటుంబసభ్యులను పరీక్షించగా 9 మందికి అసలేం లక్షణాలు లేవి అధ్యయనంలో తేలింది. అయినా దీనిని నిర్ధారించడానికి పరిశోధనలు చేయాలని పరిశోధకులు వెల్లడించారు. ఈ వైరస్ కరోనా కంటే చాలా ప్రమాదకరమైనదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం హెనిపా వైరస్‌కు వ్యాక్సిన్, చికిత్స లేదు. స్వీయ రక్షణ మాత్రమే చికిత్స. లాంగ్యా హెనిపావైరస్ కేసులు ఇప్పటివరకు ప్రాణాంతకం, చాలా తీవ్రమైనవి కావు. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదని డ్యూక్-ఎన్‌యుఎస్ మెడికల్ స్కూల్‌లోని ఎమర్జింగ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ప్రోగ్రామ్‌లో ప్రొఫెసర్ వాంగ్ లిన్ఫా గ్లోబల్ టైమ్స్‌తో పేర్కొన్నారు.
తాజావార్తలు
-
AUS vs BAN: మ్యాచ్ పోయే.. సిరీస్ పోయే.! ఆసీస్ పని అయిపోయిందా.?
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్‌లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!