Site icon NTV Telugu

Breaking News: గాజాపై శక్తివంతమైన దాడులకు నెతన్యాహూ ఆదేశాలు..

Netanyahu

Netanyahu

Breaking News: గాజా కాల్పుల విరమణకు కొత్త పరీక్షకు ఎదురైంది. తక్షణ, శక్తివంతమైన దాడులకు నెతన్యాహూ ఆదేశాలు ఇచ్చారు. హమాస్ కాల్పుల విరమణను ఉల్లంఘించిందని ఆరోపించిన తర్వాత ఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ మంగళవారం గాజా ప్రాంతంలో బలవంతమైన దాడులకు ఆదేశించారు. దక్షిణ గాజాలో హమాస్ తన దళాలపై కాల్పులు జరిపిందని ఇజ్రాయిల్ నివేదించింది. హమాస్ వద్ద ఉన్న బందీలకు చెందిన అవశేషాలు తిరిగి ఇస్తున్న తరుణంలో ఇజ్రాయిల్ నుంచి ఈ ఆదేశాలు వచ్చాయి. నెతన్యాహూ దాడులకు ఆదేశించిన నిమిషాల తర్వాత, మంగళవారం సాయంత్రం జరగాల్సిన మరో బందీ మృతదేహాన్ని అప్పగించడాన్ని వాయిదా వేస్తున్నట్లు హమాస్ ప్రకటించింది.

Exit mobile version