Site icon NTV Telugu

Israel: ఇరకాటంలో నెతన్యాహు ప్రభుత్వం.. కీలక మిత్రపక్షం నిష్క్రమణ

Israel

Israel

ఇజ్రాయెల్‌లో నెతన్యాహు ప్రభుత్వానికి ముప్పు వాటిల్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన వివాదాస్పద బిల్లును ప్రధాన మిత్రపక్షం తీవ్రంగా వ్యతిరేకించింది. బిల్లును వ్యతిరేకిస్తూ సంకీర్ణ ప్రభుత్వం నుంచి నిష్ర్కమించింది. దీంతో నెతన్యాహు ప్రభుత్వం ప్రమాదపు అంచున చేరింది. అదే జరిగితే గాజాపై యుద్ధం కొనసాగించే అవకాశం తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: Minister Satya Kumar Yadav: వైసీపీపై మంత్రి సత్యకుమార్‌ ఫైర్.. అబద్ధాలను ప్రచారం చేయడంలో ఆరితేరారు..!

ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో సైనిక ముసాయిదా మినహాయింపులను స్థిరపరిచే ప్రతిపాదిత చట్టాన్ని నెతన్యాహు ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే ఈ బిల్లును పార్లమెంట్‌లో ఆరు స్థానాలు కలిగిన ఉన్న అల్ట్రా-ఆర్థడాక్స్ పార్టీ, దాని మిత్రపక్షం వ్యతిరేకిస్తున్నాయి. ప్రస్తుతం అల్ట్రా-ఆర్థడాక్స్ పార్టీ సంకీర్ణం నుంచి వైదొలిగింది. దీంతో నెతన్యాహు ప్రభుత్వం ప్రమాదపు అంచునకు వెళ్లింది. మరో మిత్ర పక్షం కూడా వైదొలిగితే మాత్రం నెతన్యాహు ప్రభుత్వం కూలిపోయినట్లే. అయితే అమల్లోకి రావడానికి ఇంకా 48 గంటల సమయం ఉంది. ఆ సమయంలోపు బుజ్జగింపులు జరిగితే మాత్రం ఎలాంటి సమస్య ఉండదు. అంతేకాకుండా ఒక పార్టీ వైదొలిగినా అంత ముప్పు ఉండదు గానీ.. ఇంకో పక్షం కూడా నిష్క్రమిస్తే మాత్రం ప్రమాదం పొంచి ఉన్నట్లే.

ఇది కూడా చదవండి: Realme C71: 6300mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ ఫోన్ ఇంత తక్కవ ధరలో ఏంటి భయ్యా.. రియల్‌మీ C71 లాంచ్..!

ప్రస్తుతం అధికారికంగా ఇంకా నిష్క్రమణ జరగలేదు. 120 మంది సభ్యులు ఉన్న పార్లమెంట్‌లో నెతన్యాహు ప్రభుత్వానికి మెజార్టీ సీటు ఒకటి తగ్గనుంది. యూటీజే పార్టీ ఉపసంహరణకు 48 గంటల వరకు సమయం ఉంది. ప్రస్తుతం రాజీ చర్చలు జరుగుతున్నాయి. అధికార పార్టీకి చెందిన మంత్రి మికీ జోహర్ మాట్లాడాతూ.. దేవుడు దయ చూపిస్తే అంతా బాగానే ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే యూటీజేతో సన్నిహింతంగా ఉన్న మరో పార్టీ కూడా వైదొలిగితే మాత్రం నెతన్యాహు ప్రభుత్వం ఇరాకటంలో పడినట్లే.

Exit mobile version