NTV Telugu Site icon

Ramchandra Poudel: తీవ్ర అస్వస్థతకు గురైన నేపాల్ అధ్యక్షుడు.. ఢిల్లీకి తరలింపు

Ramchandra Poudel

Ramchandra Poudel

Nepal President Ramchandra Poudel Shifted To AIIMS Delhi After Being Diagnosed With Lung Infection: నేపాల్‌ అధ్యక్షుడు రామ్‌‌చంద్ర పౌడెల్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం ఆయన ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడంతో.. ఖాట్మాండులోని మహారాజ్‌గంజ్‌ త్రిభువన్‌ యూనివర్సిటీ టీచింగ్‌ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు.. ఊపిరితితుల్లో ఇన్ఫెక్షన్ ఉన్నట్టు గుర్తించారు. దీంతో.. మెరుగైన చికిత్స అందించడం కోసం బుధవారం ఆయన్ను ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించారు. పౌడెల్ అడ్వైజర్ మాట్లాడుతూ.. అధ్యక్షుడు ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయిన వెంటనే మేము ఆయన్ను ఆసుపత్రికి తరలించాం. గత 15 రోజుల నుంచి ఆయన యాంటీబయోటిక్స్ తీసుకుంటున్నారు. అయినప్పటికీ ఆయన ఆరోగ్యంలో ఎలాంటి మార్పు రాలేదు’’ అని పేర్కొన్నారు. పౌడెల్ ఆసుపత్రిపాలైన విషయం తెలిసి.. ఆయన్ను పరామర్శించేందుకు ప్రధానమంత్రి పుష్పకమల్ దహల్ ఆసుపత్రికి వెళ్లారు.

Irrfan Khan: మహానటుడి చివరి హిందీ సినిమా రిలీజ్ అవుతోంది…

కాగా.. నెల రోజుల వ్యవధిలో పౌడెల్ ఆసుపత్రిలో చేరడం ఇది రెండోసారి. గతవారమే కడుపునొప్పితో ఆయన ఆసుపత్రిపాలయ్యారు. మంగళవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో.. ఆయన చికిత్సకు ప్రభుత్వ అధికారులను నియమించాలని నిర్ణయించింది. ఒక అధికారుల బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిపై నివేదిక తయారు చేసి, ప్రభుత్వానికి అందజేస్తుంది. నివేదిక ఆధారంగా.. అధ్యక్షుడి చికిత్సపై తదుపరి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఇదిలావుండగా.. మార్చి 10వ తేదీన నేపాల్‌ అధ్యక్షుడిగా రామచంద్ర పౌడెల్‌ ఎన్నికయ్యారు. అదేనెల 13న అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. నేపాలీ కాంగ్రెస్‌కు చెందిన రామచంద్ర.. పార్లమెంటులో రెండో అతిపెద్ద పార్టీ సీపీఎన్‌-యూఎంఎల్‌ మద్దతునిచ్చిన అభ్యర్థి సుభాష్‌ చంద్ర నెబ్‌మాంగ్‌పై విజయం సాధించారు. పౌడెల్‌ 214 మంది ఎంపీలు, 352 మంది ప్రావిన్షియల్‌ అసెంబ్లీ సభ్యుల ఓట్లు పొందారు.

Meta Layoffs: ఉద్యోగులకు మెటా మరో ఝలక్.. మరిన్ని తొలగింపులకు సిద్ధం

Show comments