Miracle Rescue: నేపాల్‌లో అద్భుత రెస్క్యూ.. 9 రోజుల తర్వాత టన్నెల్ నుంచి ఇద్దరు కార్మికులు సజీవంగా బయటకు! (వీడియో)
- నేపాల్ వరదల్లో అద్భుతం
- 9 రోజుల తర్వాత టన్నెల్ నుంచి ఇద్దరు కార్మికుల రక్షణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Miracle Rescue in Nepal: ప్రకృతి బీభత్సంతో అతలాకుతలమైన నేపాల్‌లో అద్భుతమైన రెస్క్యూ ఆపరేషన్ జరిగింది. భారీ వరదల కారణంగా టన్నెల్లో చిక్కుకుపోయిన ఇద్దరు హైడ్రోపవర్ ప్రాజెక్టు కార్మికులను 9 రోజుల తర్వాత సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. శుక్రవారం జరిగిన ఈ రెస్క్యూ ఆపరేషన్‌కు సంబంధించిన వివరాలను నేపాల్ ప్రభుత్వ మంత్రులు వెల్లడించారు. రెస్క్యూ అయిన వారిని 45 ఏళ్ల కబీర్ మహర్జన్, 30 ఏళ్ల సంజయ్ సాహ్ గా గుర్తించారు.
మొదట ఒకరు.. ఆ తర్వాత మరొకరు రక్షణ
నేపాల్ ఎనర్జీ మంత్రి బిరాజ్ భక్త శ్రేష్ఠ మాట్లాడుతూ.. త్రిశూలి 3A హైడ్రోపవర్ ప్రాజెక్టులోని debrisతో కప్పబడిన టన్నెల్ నుంచి ఒక కార్మికుడిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్లు తెలిపారు. కొద్దిసేపటికే రెండో కార్మికుడిని కూడా రక్షించినట్లు హోం మంత్రి సుదన్ గురుంగ్ ప్రకటించారు. నేపాల్ ఆర్మీ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టరేట్ ప్రకారం.. కబీర్ మహర్జన్ ప్రాజెక్టులో మెకానికల్ సూపర్వైజర్ గా పనిచేస్తుండగా, సంజయ్ సాహ్ ఫోర్మన్ గా విధులు నిర్వహిస్తున్నారు.
Also Read
- Smit Machchhar: ‘రియల్ హీరో’.. యావత్ దేశం సెల్యూట్ చేస్తోంది.. భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్‌పై నెతన్యాహు ప్రశంసలు
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
- El Nino Effect: ఎల్ నినో ఎఫెక్ట్.. ఎడారిలో విరగబూసిన పూలు!
టన్నెల్లో నుంచి వినిపించిన స్వరాలు
వరదలు, కొండచరియలు విరిగిపడటంతో టన్నెల్లో భారీగా మట్టి, రాళ్లు పేరుకుపోయాయి. దీంతో లోపల చిక్కుకున్న కార్మికులను గుర్తించడం, బయటకు తీసుకురావడం రెస్క్యూ బృందాలకు అత్యంత కష్టంగా మారింది. నేపాల్ ఆర్మీ నేతృత్వంలోని సంయుక్త భద్రతా బలగాలు ప్రత్యేక పరికరాలతో గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో టన్నెల్ లోపల నుంచి స్వరాలు వినిపించడంతో రెస్క్యూ ఆపరేషన్‌కు కీలకమైన బ్రేక్‌థ్రూ లభించింది. లోపల చిక్కుకున్న వారితో కమ్యూనికేషన్ కూడా ఏర్పాటు చేయగలిగారు. అనంతరం నేపాల్ ఆర్మీ, ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ సిబ్బంది రెస్క్యూ చర్యలను మరింత వేగవంతం చేసి చివరకు ఇద్దరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
నేపాల్‌లో వరదల మృతుల సంఖ్య 1,282
ఇదిలా ఉండగా.. ఆగస్టు 26న నేపాల్-టిబెట్ సరిహద్దు సమీపంలో సంభవించిన ఐస్-రాక్ అవలాంచ్ కారణంగా భారీ ఆకస్మిక వరదలు సంభవించాయి. ఉత్తర, మధ్య నేపాల్‌లోని అనేక పట్టణాలు, గ్రామాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. శుక్రవారం నాటికి ఈ విపత్తులో మృతుల సంఖ్య 1,282కు చేరుకుంది. మరో 4,700 మందికి పైగా గల్లంతైనట్లు అధికారులు చెబుతున్నారు. నేపాల్ భద్రతా బలగాల సంయుక్త కమాండ్ ఆధ్వర్యంలో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సుమారు 4,798 మంది ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉందని సమాచారం.
వందలాది మంది పిల్లలు గల్లంతు
వరదల ప్రభావం పిల్లలపై కూడా తీవ్రంగా పడింది. రసువా జిల్లాలో సుమారు 280 మంది పిల్లలు, పొరుగున ఉన్న నువాకోట్ జిల్లాలో 300 నుంచి 350 మంది పిల్లలు గల్లంతైనట్లు స్థానిక విద్యా శాఖల ప్రాథమిక సమాచారం వెల్లడిస్తోంది. నువాకోట్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ అండ్ కోఆర్డినేషన్ యూనిట్ అధికారి సూర్య బహదూర్ ఖత్రి మాట్లాడుతూ.. పాఠశాల ప్రధానోపాధ్యాయులతో కలిసి గల్లంతైన విద్యార్థుల సంఖ్యను నిర్ధారించే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతినడంతో ఖచ్చితమైన వివరాలను సేకరించడం అధికారులకు కష్టంగా మారింది. ఇప్పటికే కొంతమంది గల్లంతైన విద్యార్థులను గుర్తించినప్పటికీ, కొత్తగా మరికొందరు కనిపించడం లేదనే సమాచారం వస్తూనే ఉందని అధికారులు తెలిపారు.
250 మంది పిల్లలు మిస్సింగ్
బిదూర్ మున్సిపాలిటీలోనే సుమారు 250 మంది పిల్లలు గల్లంతైనట్లు సమాచారం. అక్కడ మొత్తం 170 విద్యా సంస్థలు ఉన్నాయి. వీటిలో 142 కమ్యూనిటీ పాఠశాలలు, 28 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. పరిస్థితి చాలా విషాదకరంగా ఉందని మున్సిపల్ విద్యా విభాగానికి చెందిన స్కూల్ ఇన్స్పెక్టర్ నవ్రాజ్ సాప్కోటా తెలిపారు. కొన్ని సందర్భాల్లో పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు బతికి ఉన్నప్పటికీ తమ పిల్లల కోసం వెతుకుతున్నారని, మరికొన్ని చోట్ల పిల్లలు తమ తల్లిదండ్రుల ఆచూకీ కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు.
టీచర్లు, విద్యా సిబ్బంది కూడా గల్లంతు
ఈ విపత్తులో ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది కూడా ప్రభావితమయ్యారు. రసువా, నువాకోట్ జిల్లాల్లో కలిపి 22 మంది టీచర్లు, విద్యా సిబ్బంది ఇంకా గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. ధాదింగ్, గోర్ఖా ప్రాంతాలకు చెందిన కొంతమంది ఉపాధ్యాయులు తీర్థయాత్ర కోసం రసువాకు వెళ్లిన సమయంలో వరదల్లో చిక్కుకున్నారని సమాచారం. రసువా జిల్లాలో 16 మంది ఉపాధ్యాయులు గల్లంతయ్యారు. వీరిలో 15 మంది కమ్యూనిటీ పాఠశాలలకు, ఒకరు ప్రైవేట్ విద్యాసంస్థకు చెందినవారు. నువాకోట్‌లో మరో ఆరుగురు ఉపాధ్యాయులు గల్లంతైనట్లు అధికారులు ధృవీకరించారు.
ఇంకా కొనసాగుతున్న గాలింపు చర్యలు
ఒకవైపు టన్నెల్లో 9 రోజుల పాటు చిక్కుకున్న ఇద్దరు కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకురావడం రెస్క్యూ బృందాలకు పెద్ద విజయంగా నిలిచింది. మరోవైపు వేలాది మంది గల్లంతైన వారి కోసం నేపాల్ భద్రతా బలగాలు గాలింపు చర్యలను కొనసాగిస్తున్నాయి. మృతుల సంఖ్య పెరుగుతుండటం, వందలాది మంది పిల్లలు సహా వేలాది మంది ఆచూకీ తెలియకపోవడం నేపాల్‌లో వరదల తీవ్రతను తెలియజేస్తోంది.
#WATCH | Nepal | Rescue workers rescue one person from inside the tunnel of the Trishuli 3A hydel project
Video source: Nepali Army pic.twitter.com/H73CLoPhL5
— ANI (@ANI) September 4, 2026
#WATCH | Nepal | Rescue workers rescue one person from inside the tunnel of the Trishuli 3A hydel project
Video source: Secretariat of the Ministry of Energy, Water Resources and Irrigation, Govt of Nepal pic.twitter.com/tNZTMoWgIp
— ANI (@ANI) September 4, 2026
తాజావార్తలు
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
Smit Machchhar: ‘రియల్ హీరో’.. యావత్ దేశం సెల్యూట్ చేస్తోంది.. భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్‌పై నెతన్యాహు ప్రశంసలు
-
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభవార్తలే, ఊహించని డబ్బు!
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
LPG Cylinder Price Hike: పండుగ సీజన్‌కు ముందు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్ల ధరలు
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!