Site icon NTV Telugu

Nepal Protest: ఖాట్మాండు వీధుల్లో ఆర్థిక మంత్రిని ఉరికించి కొట్టారు.. వీడియో వైరల్..

Nepal

Nepal

Nepal Protest: సోషల్ మీడియా బ్యాన్‌కు వ్యతిరేకంగా, నేపాల్‌లో యువత పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ ఆందోళన హింసాత్మక సంఘటనలకు దారి తీసింది. సోమవారం, భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో 20 మంది ఆందోళకారులు మరణించారు. దీంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. రాజధాని ఖాట్మాండు అల్లర్లలో అట్టుడుకుతోంది. వేరే దారి లేక సైన్యం సలహా మేరకు ప్రధాని కేపీ శర్మ ఓలీ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన దేశం వదిలి విదేశాలకు పారిపోతున్నట్లు తెలుస్తోంది.

Read Also: Andhra Pradesh : మెడికల్ కాలేజీల అంశంపై టీడీపీ – వైసీపీ వార్.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేడెక్కిన వాతావరణం

ప్రధాని ఇంటితో పాటు అధ్యక్ష భవనం, సుప్రీంకోర్టు, పార్లమెంట్‌ను తగలబెట్టారు. ఇదిలా ఉంటే, ఆర్థిక మంత్రి బిష్ను ప్రసాద్ పాడెల్‌(65)ను ఖాట్మాండు వీధుల గుండా పరిగెత్తించి కొట్టారు. ఒక ఆందోళనకారులు కాలితో తన్నితే, ఆయన కుప్పకూలిపోయారు. వీటికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Exit mobile version