Site icon NTV Telugu

Asteroid: భూమి వైపు దూసుకొస్తున్న భారీ గ్రహశకలం..!

అంతరిక్షంలో తరచూ కొన్ని ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి.. కొన్ని గ్రహశకలాలు భూమిపైకి దూసుకొస్తాయి.. కొన్ని సార్లు ప్రమాదం జరిగినా.. చాలా సార్లు ప్రమాదాలు తప్పాయి.. అయితే, అంతరిక్షం నుంచి మరో ప్రమాదం రాబోతోంది.. ఒక గ్రహశకలం భూమి వైపు దూసుకొస్తోందని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) వెల్లడించింది. ఈ గ్రహశకలం 450 మీటర్ల వెడల్పు ఉందని చెప్పింది. మిగతా గ్రహశకలాలతో పోలిస్తే దీని సైజు అంత భయపడాల్సినది కాదని శాస్త్రవేత్తలు అంటున్నారు. అయితే ఇది ప్రయాణించే వేగం ప్రమాదకరంగా ఉందని చెప్తున్నారు. ఈ గ్రహశకలం గంటకు 49,513 కిలోమీటర్ల వేగంతో భూమి వైపు దూసుకొస్తోందని తెలిపారు. ఇది గనుక భూమిపై పడితే చాలా నష్టం జరుగుతుందని అంచనా వేస్తున్నారు.

Read Also: TRS: కేంద్రంపై ఒత్తిడి.. ఢిల్లీలో.. గల్లీలోనూ పోరు..

తాజాగా, పొటెన్షియల్లీ హజార్డస్ గ్రహశకలాల జాబితాలో నాసా చేర్చింది. ఆస్టరాయిడ్ 2013బీవో76 అని పిలిచే ఇది.. ఈసారి భూమికి 51 ,11,759 కిలోమీటర్ల దూరం నుంచి దూసుకుపోతుందని, భూమిపై ఎటువంటి ప్రభావమూ చూపబోదని సైంటిస్టులు చెబుతున్నమాట.. ఈ రోజే ఆ గ్రహశకలం భూమిని దాటేస్తుందని ఓ అంచనా ఉంది.. అయితే, ఇది ఇలా మన భూమి సమీపంలోకి రావడం ఇదేమీ తొలిసారి కాదట.. ఎందుకంటే.. 2013లో కూడా ఇలాగే భూమి వైపు దూసుకొచ్చిన ఈ ఆస్టరాయిడ్.. అప్పుడు 78,88,295 కిలోమీటర్ల దూరం నుంచి వెళ్లిపోగా.. ఈసారి మాత్రం మరింత దగ్గరగా వస్తోంది.. 2033 జులై 14న మరోసారి ఇది భూమి దగ్గరకు వస్తుందనే అంచనాలున్నాయి.

Exit mobile version