NTV Telugu Site icon

NASA: అంగారకుడిపై ఎగిరిన బుల్లి హెలికాప్టర్.. వీడియో..

Mars

Mars

NASA: రెండేళ్ల క్రితం నాసా అంగారకుడిపైకి పరిశోధన నిమిత్తం పర్సువరెన్స్ రోవర్ తోపాటు ఓ తేలికపాటి గాలిలో ప్రయానించే హెలికాప్టర్ ను పంపింది. మార్స్ పై ఉండే తేలికపాటి వాతావరణంలో ఇంజెన్యూటీ హెలికాప్టర్ ఎగురుతుందా..? లేదా..? అనే ఉద్దేశంతో శాస్త్రవేత్తలు రోవర్ తో పాటు దీన్ని పంపించాయి. ఇప్పటికే పలు మార్లు అంగారకుడి వాతావరణంపై ఈ హెలికాప్టర్ ఎగిరింది. తాజాగా 50వ సారి తన ఫ్లైట్ కంప్లీట్ చేసుకుంది. ఏప్రిల్ 13న ఈ చిన్న హెలికాప్టర్ 145.7 సెకన్లలో 1,057.09 అడుగుల (322.2 మీటర్లు) ఎత్తు వరకు ప్రయాణించింది.

Read Also: MI vs KKR: వెంకటేశ్‌ అయ్యర్‌ ఊచకోత.. ముంబయికి భారీ లక్ష్యం

ఫిబ్రవరి 2021లో NASA పర్సువరెన్స్ రోవర్ తో కలసి పంపించారు. ఏప్రిల్ 19, 2021తో తొలిసారి ఎగిరిన ఇంజెన్యూటీ, త్వరలో రెండేళ్లు పూర్తి చేసుకుంది. భూమి తర్వాత మానవనివాసానికి యోగ్యంగా ఉన్న గ్రహంగా మార్స్ ను భావిస్తున్నారు. ఈ గ్రహంపై కొన్ని బిలియన్ ఏళ్ల క్రితం వరకు నీరు ఉండేదనే ఆనవాళ్లు లభించాయి. ఈ గ్రహం పై ఉన్న వివరాలను కనుగొనేందుకు నాసాతో పాటు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వంటివి పలు రోవర్లను పంపించాయి. క్యూరియాసిటీ, ఆపర్చునిటీ, పర్సువరెన్స్ రోవర్లు ఇందులో ప్రధానంగా ఉన్నాయి.