NTV Telugu Site icon

అంగారకుడి మీదకు నాసా రహస్య సందేశం… కోడ్ రూపంలో…

ఇటీవలే అంగారకుడి మీదకు నాసా పర్సెవరెన్స్ రోవర్ ను పంపింది.  ఈ రోవర్ ఉపగ్రహం సేఫ్ గా అంగారకుడి మీదకు ల్యాండ్ చేయడంలో పారాచూట్ కీలక పాత్ర పోషించింది.  70 అడుగుల ఈ పారాచూట్ రోవర్ ను సేఫ్ గా ల్యాండ్ చేయడంతో పాటుగా ఓ రహస్య సందేశాన్ని కూడా అంగారకుడి మీదకు తీసుకెళ్లింది.  బైనరీ రూపంలో ఓ కోడ్ ను పారాచూట్ పై ముద్రించారు.  గొప్ప పనుల కోసం ధైర్యంగా ప్రయత్నించండి అని ముద్రించారు.  నాసా సిస్టం ఇంజనీర్ మైఖేల్ క్లార్క్ బైనరీ రూపంలో ఈ మెసేజ్ ను పారాచూట్ పై ముద్రించాడు.  పజిల్ రూపంలో ఉన్న కోడ్ ముద్రణ గురించి నాసాలో ముఖ్యమైన ఆరుగురికి మాత్రమే తెలుసు అని నాసా పేర్కొన్నది.