Site icon NTV Telugu

Artemis 2: 40 నిమిషాల పాటు భూమితో సంబంధాలు కోల్పోయిన ఆర్టెమిస్ 2.. కారణమిదే..

Artemis Ii

Artemis Ii

Artemis 2: మానవసహిత అంతరిక్ష ప్రయాణంలో ఆర్టెమిస్ -2 రికార్డ్ సృష్టించింది. నాసా మిషన్ సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోంది. 50 ఏళ్ల ఏళ్ల తర్వాత తొలి చంద్రుడి అంతరిక్ష యాత్ర కొనసాగుతోంది, నలుగురు వ్యోమగాములు చంద్రుడి సమీపంలోకి వెళ్లారు. ఇప్పటికే వ్యోమనౌక చంద్రుడి గ్రావిటీ పరిధిలోకి వెళ్లింది. వ్యోమనౌక చంద్రుడి అవతలి పక్కకు వెళ్లిన సమయంలో దాదాపుగా 40 నిమిషాల పాటు భూమితో సంబంధాలు కోల్పోయింది. ఇది తాత్కాలిక, ఊహించిన పరిణామమే. 40 నిమిషాల తర్వాత హ్యూస్టన్‌లోని నాసా మిషన్ కంట్రోల్, నౌకతో మళ్లీ కమ్యూనికేషన్ పునరుద్ధరించింది.

Read Also: Donald Trump: ఇరాన్‌ ఒక్క రాత్రిలో నాశనం అవుతుంది.. ట్రంప్ ఫైనల్ వార్నింగ్..

చంద్రుడి వెనకాలకు వెళ్లినప్పుడు సంబంధాలు కోల్పోవడానికి కారణం ‘‘లైన్ ఆఫ్ సైట్’’. భూమి నుంచి రేడియో తరంగాలు, కాంతి తరంగాల వలే సరళ రేఖలో ప్రయాణిస్తాయి. చంద్రుడు వెనకాలకు వ్యోమనౌక వెళ్లినప్పుడు, భూమికి-వ్యోమనౌకకు మధ్య చంద్రుడు ఒక అడ్డు గోడలా నిలుస్తాడు. దీని వల్ల భూమి నుంచి వచ్చే సిగ్నల్స్ వ్యోమనౌక అందుకోలేదు. నౌక నుంచి వచ్చే సిగ్నల్స్ భూమి అందుకోదు. దీనిని ‘‘రేడియో షాడో జోన్’’గా పిలుస్తారు.

ఆర్టెమిస్ 2 అనేక రికార్డుల్ని నెలకొల్పుతోంది. 1970 అపొలో 13 యాత్ర నెలకొప్పిన రికార్డును బద్దలుకొట్టింది. ఈ యాత్ర ద్వారా భూమి నుంచి అత్యంత సుదూర ప్రాంతానికి చేరిన మానవ సహిత అంతరిక్ష యాత్రగా మారింది. 1972 డిసెంబర్ నుంచి ఏ మానవుడు కూడా భూమి కక్ష్యను దాటి వెళ్లలేదు. ఏప్రిల్ 2, 2026న దీనికి నాసా ఆర్టిమిస్-2 మిషన్ ముగింపు పలిచింది. ఈ మిషన్ ద్వారా ప్రయాణించిన వ్యోమగాములు భూమి నుంచి 4,06,773 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. ఇది అత్యంత సుదూర మానవ అంతరిక్ష యాత్ర రికార్డును బద్దలు కొట్టడానికి సిద్ధంగా ఉంది. 1970లో అపోలో 13 నెలకొల్పిన రికార్డు కన్నా ఇది సుమారుగా 2500 కి.మీ ఎక్కువ.

Exit mobile version