NASA: నాసాకు చెందిన కొలంబియా స్పేస్ షటిల్ డిజాస్టర్‌ను ఎవరూ మరిచిపోలేరు. అంతరిక్ష పరిశోధనలు ముగించుకుని భూమికి తిరిగి వస్తున్న సమయంలో ఈ కొలంబియా వ్యోమనౌక కూలిపోయింది. ఈ ప్రమాదంలో భారత సంతతికి చెందిన కల్పనా చావ్లా మరణించారు. అయితే, 2024లో 8 రోజుల మిషన్ కోసం అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన సునీతా విలియమ్స్ కూడా దాదాపుగా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నట్లు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా నివేదికి తెలిపింది.
ఫిబ్రవరి 19, 2026న విడుదలైన 311 పేజీల నివేదికలో సునితా విలియమ్స్ మిషన్‌లో తీవ్ర లోపాలు ఉన్నాయని నాసా అడ్మినిస్ట్రేటర్ జారెడ్ ఇసాక్‌మాన్ రాశారు. లోపాలను నాసా, బోయింగ్ విస్మరించింనందుకు తీవ్రంగా విమర్శించారు. 8 రోజుల మిషన్ కోసం వెళ్లిన సునీతా విలియమ్స్ ఇతర సిబ్బంది బోయింగ్ స్టార్‌లైనర్(Boeing Starliner) లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)కు వెళ్లారు. అయితే, ఆ తర్వాత స్టార్‌లైనర్‌లో ప్యూయల్ లీకేజీ వంటి సాంకేతిక సమస్యలు ఏర్పడటంతో 9 నెలల పాటు వారు అక్కడే చిక్కుబడిపోయారు.
సునీతా విలియమ్స్ ప్రయాణం కూడా ఛాలెంటజర్, కొలంబియా షటిల్ ప్రమాదాల మాదిరిగా మారతుందని అంతా భావించారు. నివేదికలో నాసా ఈ మిషన్‌ను “టైప్ A” ప్రమాదంగా పేర్కొంది. 300 కంటే ఎక్కువ పేజీల నాసా నివేదికలో తీవ్రస్థాయి లోపాలు ఉన్నట్లు పేర్కొంది. తప్పుడు ఇంజనీరింగ్, సరిపోని పర్యవేక్షణ స్టార్‌లైనర్ వైఫల్యానికి కారణమయ్యాయని చెప్పింది. చివరగా 9 నెలల తర్వాత డ్రాగన్ క్యాప్సూల్ ద్వారా సునితా విలియమ్స్ భూమికి తిరిగి వచ్చారు. జూన్ 5, 2024న బోయింగ్ సంస్థకు చెందిన ‘స్టార్‌లైనర్’ అంతరిక్ష నౌకలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) వెళ్ళారు. చివరకు మార్చి 18, 2025న స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ ద్వారా తిరిగి వచ్చారు.