NTV Telugu Site icon

Bangladesh: బంగ్లాదేశ్ ప్రభుత్వాధినేతగా యూనస్ ప్రమాణం

Muhammadyunus

Muhammadyunus

షేక్ హసీనా ప్రధానిగా 15 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. కొత్త అధ్యాయానికి నాంది పలుకుతూ బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వాధినేతగా నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. అధ్యక్ష కార్యాలయం ‘బంగభబన్‌’లో నిర్వహించిన కార్యక్రమంలో యూనస్‌తో దేశాధ్యక్షుడు మొహమ్మద్‌ షహబుద్దీన్‌ ప్రమాణం చేయించారు. కోటా ఉద్యమం తర్వాత ప్రధానిగా ఉన్న షేక్‌ హసీనా రాజీనామా చేసి భారత్‌కు వచ్చేశారు. ఈ క్రమంలోనే దేశాధ్యక్షుడు పార్లమెంటును రద్దు చేశారు. తాత్కాలిక పరిపాలన యంత్రాంగానికి యూనస్‌ను సారథిగా నియమిస్తున్నట్లు సైన్యం ప్రకటించింది. గురువారం ఉదయం ఫ్రాన్స్‌ నుంచి ఢాకాకు చేరుకున్న యూనస్‌.. సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు.