NTV Telugu Site icon

Norway Jail: ఇది జైలు కాదు స్వర్గం.. అంతకు మించి!

Norway Jail

Norway Jail

Norway Jail: ఎవరైనా నేరం చేస్తే వాళ్లను బొక్కలో తోస్తారు. అంటే జైలులో వేస్తారు. ఎందుకు అంటే.. అక్కడే కొన్నేళ్ల పాటు వాళ్లను ఉంచి.. వాళ్లకు కష్టాలు పెట్టి వాళ్లలో మార్పును తీసుకురావడానికి. అందుకే జైలులో అన్ని సౌకర్యాలు ఉండవు. ఎక్కడైనా అవే రూల్స్ ఉంటాయి. పైగా నిద్రపట్టకుండా చేసే దోమలు, దుర్గంధం వెదజల్లే గదులు గుర్తొచ్చి ఒక దుర్భర జీవితాన్ని ఊహించుకుంటాం. కానీ నార్వేలోని హాల్డెన్‌ జైలు ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన జైలుగా పేరొందింది. జైళ్ల విషయంలో పూర్తిగా నిబంధనలు మార్చిన తర్వాత అక్కడి జైళ్ల పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

ఇక్కడ జైలులో గడిపిన వాళ్లు ఆ తర్వాత సమాజంలో గౌరవంగా బతకాలని చూస్తున్నారు. దీనితో ఆ దేశంలో నేరాల సంఖ్య కూడా పడిపోయింది. నార్వేలోని హాల్డెన్ జైలులో కటకటాల గదులు ఉండవు. చిన్న డబుల్ బెడ్‌రూమ్ గదులు ఉంటాయి. ఖైదీలు తమకు ఇష్టమైన గదుల్లో ఉండవచ్చు. విశ్రాంతి తీసుకుని బయటకు వెళ్లి తమ పనులు చేసుకుని తిరిగి జైలుకు వచ్చి భోజనం చేసి నిద్రపోతారు. ఇదంతా నిజమేనండి. ఇన్ని సౌకర్యాలు కల్పిస్తే సమాజంలో కూడా గౌరవంగా బతకాలనే ఫీలింగ్ వస్తుందని ఆ జైలు అధికారులు అంటున్నారు.

ఇక్కడి ఖైదీలు సముద్రానికి వెళ్లి చేపలు పట్టవచ్చు. మైదానానికి వెళ్లి ఫుట్ బాల్ ఆడుకోవచ్చు. జైలు సిబ్బంది కాపలా కూడా తక్కువే ఉంటుంది, కాకపోతే సీసీ కెమెరాల నిఘా ఉంటుంది తప్ప, ఖైదీలను అణచివేసే విధానం ఉండదు. దీనితో జైలులో అన్ని పనులు వంతులు వారీగా వేసుకుంటారు. జైల్లో ప్రత్యేకించి ఎలాంటి బట్టలు వుండవు, ఎవరికీ నచ్చిన బట్టలు వాళ్లు కొనుక్కొని వేసుకోవచ్చు. ఇక బంధువులు వస్తే దూరం దూరంగా ఉంది మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. వారికీ గదులు కేటాయిస్తారు. వాళ్లతో ఏకాంతంగా మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. ఖైదీలకు ఇంత స్వేచ్చ ఇచ్చినప్పుడు వాటిని దుర్వినియోగం చేయటం లాంటిది సాధారణంగా జరుగుతాయి. కానీ ఇక్కడ మాత్రం అలాంటివి ఏమి లేవు. ఖైదీలు అధికారులతో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. నార్వేలో ఇలాంటి తరహా జైళ్లలో ఉన్న ఖైదీలకు ప్రత్యేకంగా ఏదీ చెప్పాల్సిన పనిలేదు. జైలుకు వచ్చిన వెంటనే ఎలా నడుచుకోవాలో నిబంధనల పట్టిక ఉంటుంది. దానిని చదువుకుని దానికి తగ్గట్లుగా వ్యవహరిస్తారు.

Constable Crying: చేతిలో ప్లేట్ పట్టుకుని ఏడ్చిన కానిస్టేబుల్.. కారణం ఏంటంటే..?

ఖైదీలు ఉదయాన్నే లేవడం, జైలులోని జిమ్‌లో వర్కవుట్స్ అనంతరం టిఫిన్‌ చేసుకుని.. తర్వాత పనులు చేసి మళ్లీ మధ్యాహ్న భోజనం చేస్తారు. అనంతరం సాయంత్రం వరకు పని చేసుకుంటారు. భోజన విషయంలో సొంతంగా వంట చేసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. అందుకే ప్రపంచంలోనే అత్యంత లగ్జరీ జైలు అని అంటారు. ఇక్కడి ఖైదీలు ఇది జైలు కాదని స్వర్గం అని కూడా అంటున్నారు.