NTV Telugu Site icon

Most Expensive Pen : ఈ పెన్ను ఎన్ని కోట్లో తెలుసా.. ప్రత్యేకతలు ఏంటంటే?

Costly Pen

Costly Pen

మనం చిన్నప్పటి నుంచి పెన్నును వాడుతూనే ఉంటాం.. ఇప్పుడు ఫోన్లు, ల్యాప్ టాప్ ల వినియోగం పెరిగిన కూడా ఎక్కడో చోట పెన్నును వాడుతూనే ఉంటాం.. నిజానికి బహుమతుల్లో ఇప్పటికీ పెన్ను కూడా ప్రధానంగానే ఉంది. విలువైన పెన్నుల్ని బహుమతిగా ఇస్తుంటారు. మరి మీ ఊహలో అత్యంత ఖరీదైన పెన్ను ఎంతుంది అనుకుంటున్నారు? మహా అయితే 100 లేదా 500,1000 రూపాయలు ఉంటుంది. కానీ ఇప్పుడు మనం చెప్పుకునే పెన్ను మాత్రం కోట్ల రూపాయలు ఉంటుంది.. ఇంతకీ దాని ధర ఎంతంటే.. రూ.60 కోట్లు, అంతకంటే ఎక్కువే. మరి ఇంతటి ఖరీదైన పెన్ను ప్రత్యేకతలు ఏంటో చూద్దాం..

ఖరీదైన పెన్నుల జాబితాలో ఫుల్గోర్ నోక్టర్నస్ అనే పెన్ను అగ్రస్థానంలో ఉంది. దీని ధర 8 మిలియన్ డాలర్లు. భారతీయ కరెన్సీలో దీని గురించి మాట్లాడినట్లయితే, ఈ పెన్ ధర 65 కోట్ల రూపాయల కంటే ఎక్కువ. అందుతున్న సమాచారం ప్రకారం.. 2010లో షాంఘైలో జరిగిన వేలంలో ఈ పెన్ను 8 మిలియన్ డాలర్లకు విక్రయించారు. ఈ పెన్ను బంగారం, నలుపు వజ్రాలతో తయారు చేశారు.. మోంట్‌బ్లాంక్ అనే కంపెనీ దీన్ని తయారు చేసింది.. బోహ్మ్ రాయల్ పెన్ 18 క్యారెట్ల తెల్ల బంగారంతో తయారు చేశారు. ఇక దాని ఎగువ భాగంలో చాలా వజ్రాలు ఉన్నాయి.. ఈ పెన్ను ఖరీదు అక్షరాల 1.5 మిలియన్ రూపాయలు.. అదే మన కరెన్సీలో రూ.12 కోట్లు..

ఇక ఈ పెన్నును వజ్రాలతో తయారు చేశారు.. అరోరా డైమంటే మూడో స్థానంలో ఉంది. ఈ పెన్ కూడా చాలా ప్రత్యేకమైనది. ఈ పెన్‌లో 30 క్యారెట్ల వజ్రాలతో పాటు పటిష్టమైన ప్లాటినం బారెల్ కూడా ఉంటుందని చెబుతున్నారు. ఈ పెన్ ధర 1.28 మిలియన్ డాలర్లు. భారతీయ కరెన్సీలో దీని ధర రూ.10 కోట్ల కంటే ఎక్కువ.. ఈ పెన్ను ను 1010 డైమండ్స్ లిమిటెడ్ ఎడిషన్ ఫౌంటెన్ పెన్ 18 క్యారెట్ల తెల్ల బంగారంతో తయారు చేయబడింది. ఈ పెన్నులో అనేక వందల వజ్రాలు కూడా ఉన్నాయి.. దీని ధర ఒక మిలియన్ డాలర్లు.. అంటే రూ. 8 కోట్లు రూపాయలు ఉంటుందని చెబుతున్నారు.. మొత్తంగా చూసుకుంటే ఈ పెన్ను ఖరీదు కోట్లల్లోనే అన్నమాట..

Show comments