Site icon NTV Telugu

Israel: సద్దాం హుస్సేన్‌ని మొసాద్ చంపాలనుకుంది.. కానీ, దారుణంగా విఫలమైన ఇజ్రాయిల్..

Saddam

Saddam

Israel: మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలు ప్రపంచాన్ని భయపెడున్నాయి. ఇజ్రాయిల్-ఇరాన్ మధ్య సంఘర్షణ రోజురోజుకు తీవ్రమవుతోంది. ఇరాన్ అణు కార్యక్రమాలను, ఇరాన్ అణు శాస్త్రవేత్తలను, కీలక మిలిటరీ జనరల్స్‌ని ఇజ్రాయిల్‌ దాడులు చేసింది. మరోవైపు, ఇరాన్ కూడా క్షిపణులతో ఇజ్రాయిల్‌పై విరుచుకుపడుతోంది. ఇప్పటి వరకు, ఇజ్రాయిల్ అత్యంత ఖచ్చితమైన దాడుల్లో 15 మంది వరకు అణు శాస్త్రవేత్తలను, మిలిటరీ ముఖ్యులను హతమార్చింది. ఇప్పుడు, ఇరాన్ సుప్రీంలీడర్‌ ఆయతుల్లా అలీ ఖమేనీని ఎలిమినేట్ చేస్తామని ఇజ్రాయిల్ ప్రకటించింది.

ఈ నేపథ్యంలో గతంలో ఇజ్రాయిల్ నిర్వహించిన ఆపరేషన్స్ గురించి ప్రపంచం చర్చిస్తోంది. అయితే, ఎన్నో విజయవంతమైన ఆపరేషన్లను ఇజ్రాయిల్ మొసాద్ గూఢచర్య సంస్థ నిర్వహించినప్పటికీ, అప్పటి ఇరాక్ ప్రెసిడెంట్ సద్దాం హుస్సేన్‌ని చంపడంలో మాత్రం సక్సెస్ కాలేకపోయింది. 1991 గల్ఫ్ యుద్ధం తర్వాత, ఇజ్రాయిల్ సద్దాంను ప్రమాదకరమైన ముప్పుగా భావించింది. సద్దాం సామూహిక విధ్వంసక ఆయుధాలను అభివృద్ధి చేస్తున్నాడని నిఘా వర్గాలు పేర్కొన్నాయి.

దీంతో ఎలాగైనా సద్దాంను చంపేయాలని ఇజ్రాయిల్ భావించింది. దీని కోసం ‘‘ఆపరేషన్ బ్రాంబుల్ బుష్’’ ప్రారంభించింది. దీనికి ఇజ్రాయిల్ అత్యంత ఉన్నత కమాండో యూనిట్ ‘‘సయెరెట్ మత్కల్’’ పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. సద్దాం హుస్సేన్ స్వస్థలమైన తిక్రిత్‌లో జరిగే అంత్యక్రియల్లో, అతను హాజరవుతారని అంచనా వేసింది. అరబ్బుల వేషంలో, ఇజ్రాయిల్ కమాండోలు ఆ ప్రాంతంలోకి వెళ్లి, సద్దాం కాన్వాయ్‌పై భుజం పై నుంచి పేల్చే క్షిపణులు ప్రయోగించాలని ప్లాన్ చేశారు. మొసాద్ ఇందుకు కావాల్సిన నిఘా సమాచారం అందించగా, ఇజ్రాయిల్ మిలిటరీ ఈ ఆపరేషన్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Read Also: Ali Khamenei: “భయపడొద్దు..” ఇరాన్ ప్రజలకు సుప్రీం లీడర్ అయతుల్లా అలీ కీలక సందేశం..

తీలిమ్ బెట్ విపత్తులో ఆగిన ఆపరేషన్:

నవంబర్ 5, 1992న సయరెట్ మత్కల్ టీం సద్దాం ఎలిమినేషన్‌ కోసం లైవ్-ఫైర్ రిహార్సల్‌ని నెగెవ్ ఏడాదిలో ప్రారంభించింది. నిజమైన దాడిని ప్రాక్టీస్ చేసేందుకు లైవ్ క్షిపణులను ఉపయోగించారు. సిమ్యులేషన్ సమయంలో, ఒక ఆపరేటివ్ పొరపాటున తన సొంత టీమ్‌పై నిజమైన క్షిపణిని ప్రయోగించాడు. దీంతో ఐదుగురు కీలక కమాండోలు చనిపోయారు. మరో ఆరుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. దీంతో సద్దాం మిషన్‌ని ఆపేపింది. ఈ సంఘటనను తీలిమ్ బెట్ విపత్తుగా పిలుస్తారు.

ప్రణాళిక, కమ్యూనికేషన్, ప్రమాద అంచనాలో తీవ్రమైన లోపాలను అంతర్గత దర్యాప్తు వెల్లడించింది. రెండు రోజుల తరువాత, ఆపరేషన్ బ్రాంబుల్ బుష్ అధికారికంగా రద్దు చేయబడింది. కమాండోల మరణాలను సంవత్సరాల తరబడి ప్రజలకు తెలియకుండా రహస్యంగా ఉంచారు, ఈ ఆపరేషన్ రహస్యంగా ఉంచబడింది.

Exit mobile version