Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడికి పాల్పడింది. రష్యా పార్లమెంటరీ ఎన్నికల చివరి రోజున మాస్కోపై డ్రోన్ దాడి జరిగింది. 1000కి పైగా డ్రోన్లలో ఉక్రెయిన్ మాస్కోపై విరుచుకుపడింది. ఈ డ్రోన్ దాడిలో మాస్కోలోని చమురు శుద్ది కర్మాగారం దెబ్బతింది. దాడి తర్వాత పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ దాడిలో ఇద్దరు మరణించినట్లు సమాచారం. శనివారం రాత్రి జరిగిన ఈ దాడి రష్యాను గణనీయంగా దెబ్బతీసిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్స్కీ అన్నారు. రష్యాకు చెందిన ఒక చమురు ఉత్పత్తి కేంద్రం, లాజిస్టిక్ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడినట్లు చెప్పారు.
ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధానికి ఈ లాజిస్టిక్ కేంద్రాలు కీలకంగా ఉన్నాయి. ఈ ఆపరేషన్‌లో FP-1, RZ-100, MICH-2000, పాలియానిట్సియా, వెండెట్టా, లియుటి, బార్స్, ఫ్లెమింగో, సిచెన్, పెలికాన్ వంటి వ్యవస్థలను ఉపయోగించారు. యుద్ధాన్ని ముగించేందుకు శాంతి మార్గాన్ని ఎంచుకోవాలని రష్యాకు జెలెన్స్కీ సూచించారు. ఇంధనం, ఆహార భద్రత రంగాలలో ఉద్రిక్తతల్ని తగ్గించే మార్గాలు ఉన్నాయని, దీనికి రాజకీయ సంకల్పం అవసరమని చెప్పారు.
రష్యాలో పార్లమెంటరీ ఎన్నికల చివరి రోజు ఈ దాడి జరిగింది. ఈ ఎన్నికలు ఉక్రెయిన్‌పై పుతిన్ సాగిస్తున్న యుద్ధానికి ఓ పరీక్షగా నిలిచాయి. రష్యా ఈ దాడికి ఉక్రెయిన్‌ను నిందించింది. మరోవైపు ఉక్రెయిన్ రష్యా నిర్వహిస్తున్న ఎన్నికల్ని తిరస్కరించింది. ఎన్నికల సమయంలో ఆన్‌లైన్ ఓటింగ్‌పై సైబర్ దాడి ప్రయత్నం జరిగినట్లు రష్యా ఎన్నికల అధికారులు తెలిపారు.
Our long-range responses had a very significant impact in the Moscow region last night. One of Russia’s key oil industry facilities and the aggressor’s logistics facility were hit. These are billions of dollars that sustain the war machine. The systems used included FP-1, RZ-100,… pic.twitter.com/ka5mlDSgb7
— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) September 20, 2026

