Site icon NTV Telugu

Russia-Ukraine conflict: వేయి మందికి పైగా రష్యా సైనికులు మృతి..!

రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం మూడో రోజుకు చేరుకుంది.. ఇప్పటికే పలు కీలక ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి రష్యా బలగాలు.. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు సమీపంలోని కీలకమైన విమానాశ్రయాన్ని కూడా హస్తగతం చేసుకున్నట్లు రష్యా సైన్యం ప్రకటించింది. దీంతో పశ్చిమ దేశాలతో కీవ్‌కు ఉన్న సంబంధాలు తెగిపోయేలా చేసింది రష్యా.. అతిపెద్ద రన్​వేతో కూడిన ఈ ఎయిర్​పోర్ట్​కు భారీ రవాణా విమానాలు వచ్చే అవకాశం ఉండడంతో.. కీవ్​శివారులోని తమ బలగాల్ని తరలించాలన్నా.. రప్పించాలన్నా రష్యాకు మరింత సులువు అయ్యింది..

Read Also: Astrology: ఫిబ్రవరి 26, శనివారం దినఫలాలు

మరోవైపు రష్యా బలగాలకు ఉక్రెయిన్‌ సైనికుల నుంచి ప్రతిఘటన గట్టిగానే ఎదురవుతున్నట్టుగా తెలుస్తోంది.. ఉక్రెయిన్​రాజధాని కీవ్ సిటీని ఆక్రమించుకునేందుకు రష్యా బలగాలు దూసుకెళ్తుంటే.. ఉక్రెయిన్​సేనలు ప్రతిఘటిస్తున్నాయి.. అయితే, ఈ దాడుల్లో ఇప్పటివరకు రష్యాకు చెందిన వేయి మందికి పైగా సైనికులు మృతిచెందినట్టు ఉక్రెయిన్ రక్షణ శాఖ ప్రకటించింది.. ఇక, ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధమని ప్రకటించారు రష్యా అధ్యక్షుడు పుతిన్.. దీని కోసం బెలారస్​రాజధాని.. మిన్స్క్​కు ఉన్నతస్థాయి అధికారులను పంపేందుకు సిద్ధంగా ఉన్నట్లు పుతిన్‌ వెల్లడించారు.

Exit mobile version