Site icon NTV Telugu

PM Modi-Yunus: మోడీ-యూనస్ భేటీ.. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ

Modi1

Modi1

థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో జరుగుతున్న బిమ్‌స్టెక్ శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోడీ, బంగ్లాదేశ్ తాత్కాలిక అధినేత ముహమ్మద్ యూనస్‌లు సమావేశమయ్యారు. భారత్-బంగ్లాదేశ్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చిస్తున్నారు. సమావేశంలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా పాల్గొన్నారు.

గతేడాది ఆగస్టులో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయాక.. నోబెల్ గ్రహీత యూనస్ ఆధ్వర్యంలో బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. అప్పటి నుంచి మోడీ-యూనస్ ముఖాముఖీగా కలవడం ఇదే తొలిసారి. ఇదిలా ఉంటే మరోవైపు చైనాతో కూడా యూనస్ సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో మోడీతో యూనస్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాకుండా ఈ మధ్య చైనాలో భారత్‌పై యూనస్ కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై భారత్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.

ఇక పర్యటనలో భాగంగా థాయ్‌లాండ్ ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్రాతో కూడా మోడీ భేటీ అయ్యారు. మోడీకి పేటోంగ్టార్న్ షినవత్రా ఘన స్వాగతం పలికారు. ఇరు దేశాలకు సంబంధించిన అనేక అంశాలపై ఇరువురు చర్చించారు. బిమ్‌స్టెక్ సదస్సులో భారత్‌తో పాటు థాయ్‌లాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, మయన్మార్, భూటాన్‌ దేశాల అధినేతలు పాల్గొన్నారు. నేతలంతా ఒక గ్రూప్ కూడా దిగారు.

 

 

Exit mobile version