కరోనా కేసులు పెరుగుతున్న వేళ మాస్క్ లేకుంటే ఫైన్ వేస్తున్నారు. రెస్టారెంట్, ఆటో, బస్సు, రైలు, ట్యాక్సీ ఎందులో ప్రయాణం చేయాలన్నా మాస్క్ పెట్టుకోవాల్సిందే. కరోనా వ్యాప్తి చెందకుండా ఉండాలంటే తప్పని సరిగా మాస్క్ ధరించాలని, వ్యాక్సిన్ తీసుకోవాలని చెబుతున్నారు. అయితే, కొంతమంది మాస్క్‌ను, వ్యాక్సినేషన్‌ను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. యో అనే ఓ ట్యాక్సి కంపెనీ ఇదే బాటలో పయనిస్తోంది. తమ ట్యాక్సిల్లో ప్రయాణం చేసేవారు మాస్క్ పెట్టుకోకూడదని, వ్యాక్సిన్ తీసుకోకూడదని ప్రకటించింది. తమ సంస్థ వ్యాక్సినేషన్‌ను పూర్తిగా వ్యతిరేకిస్తోందని, తమ ట్యాక్సిలో ప్రయాణం చేయాలనుకునే ప్రయాణికులు వ్యాక్సిన్ తీసుకున్నారా లేదా అని ముందుగా పరిశీలిస్తామని, ట్యాక్సీ ఎక్కిన తరువాత లోపల మాస్క్ పెట్టుకోబోమని చెప్పిన తరువాతే ట్యాక్సీ ప్రయాణం చేస్తుందని ఆ సంస్థ ప్రకటించింది. ఆ యో ట్యాక్సీ కంపెనీ మిస్సౌరీ రాష్ట్రంలో ఉన్నది. అమెరికాలో వ్యాక్సిన్ మందకోడిగా సాగుతున్న రాష్ట్రాల్లో టాప్ 3 లో మిస్సౌరీ కూడా ఉండటం విశేషం.
మాస్క్ పెట్టుకుంటే… ఆ ట్యాక్సిలోకి నో ఎంట్రీ…
