ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల అరాచక పాలన సాగుతున్నది. ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. వ్యాపార సంస్థలను తెరవాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నారు వ్యాపారులు. చిన్న చిన్న వ్యాపారం చేసుకునేవారు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో చెప్పాల్సిన అవసరం లేదు. బడా వ్యాపారవేత్తలు అక్కడే ఉంటే ప్రాణాలతో ఉండలేమని చెప్పి ముందుగానే దేశం వదిలి వెళ్లిపోయారు. ఇలాంటి దుర్భరమైన పరిస్థితుల్లో కూడా ఓ వ్యక్తి నిర్వహిస్తున్న వ్యాపారం దివ్యంగా సాగుతున్నది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరుగుతున్నది. ఆఫ్ఘనిస్తాన్‌లో అజీజ్ గ్రూప్‌కు మంచి పేరు ఉన్నది. అజీజ్ గ్రూప్‌లో ఆయిల్, బ్యాకింగ్, రియల్ ఎస్టేట్, సేవా సంస్థలు ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్‌లో వినియోగించే ఆయిల్‌లో 70 శాతం ఆయిల్ అజీజ్ కంపెనీ నుంచి వస్తుంది. అజీజ్ గ్రూప్ కు చెందిన బ్యాంకులు ఆ దేశంలో 80 శాఖలు ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రజాస్వామ్య పాలనలో ఏ విధంగా అయితే వ్యాపారం జోరుగా సాగిందో, తాలిబన్ల ఆక్రమణ తరువాత కూడా అదేవిధంగా సాగుతున్నట్టు అజీజ్ గ్రూప్ పేర్కొన్నది. అజీజ్ గ్రూప్ నుంచే తాలిబన్లకు కూడా ఆయిల్ సరఫరా అవుతుందని వ్యాపారులు చెబుతున్నారు.
Read: కాబూల్ ఎయిర్‌పోర్టులో దారణ పరిస్థితులు… లీటర్ వాటర్ బాటిల్ ఎంతో తెలుసా?
