Site icon NTV Telugu

Minister KTR: వాషింగ్టన్ డీసీలో WTITC స్కై సోర‌ర్ లాంచ్ చేసిన మంత్రి కేటీఆర్‌

Ktr Launched Sky Sorer

Ktr Launched Sky Sorer

Minister KTR Launched WTITC Sky Sorer In Washington DC: తెలుగు ఐటీ సంస్థల‌కు వేదిక‌గా నిలిచి, రెండు రాష్ట్రాల‌ను అభివృద్ధి ప‌థంలో తీసుకుపోవ‌డం ల‌క్ష్యంగా ఏర్పాటైన వ‌ర‌ల్డ్ తెలుగు ఐటీ కౌన్సిల్ (WTITC- ప్రపంచ‌ తెలుగు స‌మాచార సాంకేతిక మండ‌లి).. అమెరికాలో త‌న ముద్ర వేసుకుంది. తెలంగాణ మంత్రి కేటీఆర్ తన అమెరికా ప‌ర్యట‌న‌లో భాగంగా.. అమెరికా రాజ‌ధాని వాషింగ్టన్ డీసీలో జ‌రిగిన కార్యక్రమంలో వ‌రల్డ్ తెలుగు ఐటీ కౌన్సిల్ ‘స్కై సోర‌ర్’ను లాంచ్ చేశారు. ప్రపంచ‌వ్యాప్తంగా ఉన్న తెలుగు ఐటీ సంస్థలు మాతృభూమి అభివృద్ధిలో భాగం చేయాలన్న ఉద్దేశంతో WTITC ని ఏర్పాటు చేసిన చైర్మన్ సందీప్ కుమార్ మ‌ఖ్తలకు కేటీఆర్ అభినంద‌న‌లు తెలిపారు. ఫ్లైయింగ్ హై విత్ డ‌బ్ల్యూటీఐటీసీ అనే థీంతో రూపొందించి.. ఈ స్కై సోర‌ర్ ద్వారా WTITC కార్యక‌లాపాల గురించి తెలియ‌జేయ‌నున్నారు.

Yashasvi Jaiswal: చరిత్ర సృష్టించిన జైస్వాల్.. తొలి అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా రికార్డ్

ప్రపంచ‌వ్యాప్తంగా ఉన్న తెలుగు టెక్నోక్రాట్లను ఒక‌తాటిపైకి తెచ్చేందుకు ఏర్పడిన‌ వ‌ర‌ల్డ్ తెలుగు ఐటీ కౌన్సిల్.. తెలుగు రాష్ట్రాల్లో పెట్టుబ‌డులు తీసుకురావడం, ఎంట్రప్రెన్యూర్‌షిప్, స్టార్టప్‌లను ప్రోత్సహించ‌డం, వివిధ భాగ‌స్వామ్య ప‌క్షాల మ‌ధ్య స‌మ‌న్వయం ల‌క్ష్యంగా కృషి చేస్తోంది. వ‌ర‌ల్డ్ తెలుగు ఐటీ కౌన్సిల్ చైర్మన్ సందీప్ మ‌ఖ్తల ఈ మేర‌కు ఇప్పటికే మ‌లేసియా, సింగపూర్, యూఏఈ, ఒమ‌న్ త‌దిత‌ర దేశాల్లో ప‌ర్యటించారు. దీనికి కొన‌సాగింపుగా ప్రస్తుత ప‌ర్యట‌న‌లో షికాగో, డ‌లాస్‌, వాషింగ్టన్ డీసీ, ఆస్టిన్‌, శాన్ అంటానియో, ఎస్ఎఫ్ఓ, సిలికాన్ వ్యాలీ న‌గరాల‌తో పాటు కెన‌డా, మెక్సికిలోని ప‌లు న‌గ‌రాల్లో ఆయ‌న ప‌ర్యటించ‌నున్నారు. సింగ‌పూర్‌లో వ‌చ్చే ఆగ‌స్టు 5, 6 తేదీల్లో జ‌ర‌గ‌బోయే ప్రపంచ తెలుగు ఐటీ మహాసభ స‌న్నాహ‌క వేదిక‌గా చేప‌డుతున్న కార్యక్రమాల్లో భాగంగా.. ఆయా దేశాల్లో ప‌ర్యటిస్తూ టెక్కీల‌ను అనుసంధానం చేస్తున్నారు.

Fast food: ఫాస్ట్ ఫుడ్ తింటున్నారా? యమ డేంజర్..

తాజాగా మంత్రి కేటీఆర్‌తో క‌లిసి వాషింగ్టన్ డీసీలో WTITC స్కై సోర‌ర్ లాంచ్ చేశారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్‌, సందీప్ మ‌ఖ్తల మాట్లాడుతూ.. అమెరికాలో ఉన్న తెలుగు టెక్కీలకు శుభాకాంక్షలు తెలిపారు. త‌మ సంస్థలు, నైపుణ్యాల ద్వారా ప్రపంచ‌వ్యాప్తంగా గుర్తింపు పొందిన మ‌న ఐటీ నిపుణులు స్టార్టప్‌ల వైపు మొగ్గు చూపాల‌ని, స్వదేశంలో పెట్టుబ‌డులు పెట్టాల‌ని సూచించారు. తెలుగు వారికి ఎంతో వృద్ధి చెందే అవ‌కాశాలు ఉన్నాయ‌ని, వాటిని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని తెలిపారు. కాగా.. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ కార్యదర్శి జయేష్ రంజన్, డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ కొనతం, విశ్వేశ్వర్ కాల్వల, వెంకట్ మంతెన, లక్స్ చేపురి, డ‌బ్ల్యూటీఐటీసీ కౌన్సిల్ సభ్యులు రమేష్ గౌడ్ చనగోని, ధర్మేంద్ర బొచ్చు, విజయ స్పందన, కరుణ, నిరంజన్, కిరణ్ మీగడ, రోనిత్ బండ, సూర్య విడియల, సాత్విక్, హరి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version