కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో చైనాలో మూడు నగరాల్లో ఇప్పటికే లాక్‌డౌన్ విధించారు. సుమారు 20 మిలియన్ల మంది ప్రజలను ఇంటికే పరిమితం చేశారు. ఇక కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ జరిగిన వారి కోసం అక్కడి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక క్వారంటైన్‌ను ఏర్పాటు చేసింది. సాధారణ ఆసుపత్రుల్లో మాదిరిగా ఒపెన్‌గా మంచాలు ఏర్పాటు చేయుండా ఒక్కో పేషేంట్‌ను ఉంచేందుకు ఒక్కో ఐరన్ క్యాబిన్‌ను ఏర్పాటు చేసింది. ఈ క్యాబిన్‌లో ఉడెన్ బెడ్‌తో పాటు టాయిలెట్ వంటి సౌకర్యాలు ఉంటాయి. పాజిటివ్ నుంచి నెగెటివ్ వచ్చే వరకు ఆ వ్యక్తి అలాంటి క్యాబిన్ లో ఉండాల్సిందే. చిన్నపిల్లలు, పెద్దవాళ్లు ఎవరైనా సరే పాజిటివ్‌గా నిర్ధారణ జరిగితే ఆ క్యాబిన్‌లో క్వార్ంటైన్‌లో ఉండి తీరాల్సిందేనని అధికారులు చెబుతున్నారు. పాజిటివ్ వచ్చిన వారు హోమ్ క్వారంటైన్‌లో ఉండటం వలన ఆ వైరస్ అక్కడి నుంచి ఇతరలకు స్ప్రెడ్ అవుతున్నదని, జీరో వైరస్ లక్ష్యాన్ని చేరుకోవాలంటే తప్పనిసరిగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని ప్రభుత్వ వర్గాలు చెబతున్నాయి.
Read: ఆంటోనీ ఫౌచీ కీలక వ్యాఖ్యలు: కరోనా అంతం సాధ్యం కాదు… కలిసి బతకాల్సిందే…
